నేటి సత్యం 
టీపీసీసీ ఆధ్వర్యంలో జులై 31వ తేదీ నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు *ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ గారు కలిసి సంయుక్తంగా
*పాదయాత్ర, *శ్రమదానం* *కార్యకర్తల*
నేటి సత్యం జూలై 30 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య
సమావేశ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి సీనియర్ కాంగ్రేసు నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈవి శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు నమీండ్ల శ్రీనివాస్, కోటిమ్రెడ్డి వినయ్‌రెడ్డి లతో తెలంగాణ కాంగ్రేస్ ఏఐసిసి ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ గారు, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ గారు , ఏఐసిసి సెక్రటరీ విశ్వనాధన్ గారు వివరంగ చర్చించడము అనంతరము పాదయాత్ర శ్రమదానం, పార్టీ కార్యకర్తల సమావేశ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం తగిన సూచనలు,సలహాలు వారు ఇవ్వడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లడం, పార్టీని సంస్థాగతంగా గ్రామ స్థాయి నుండి మరింత పటిష్టం చేయడం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం, పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలసి ఇంటరాక్షన్ సమన్వయం సమాలోచన తదితర కార్యక్రమాలను నిర్వహించడము జరుగుతుంది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ కాంగ్రేస్ పార్టీ క్యాడర్ ను స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధత చేసేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని. అందువల్ల ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నాయకులు , ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని పాద యాత్ర, శ్రమదానం,కాంగ్రేస్ కార్యకర్తల సమావేశ కార్యక్రమాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు.
విధిగ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు ,కార్యకర్తలు,
అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున పాదయాత్ర లో పాల్గొని పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెల్లుటకు జిల్లాల ఇన్చార్జులు క్రుషి చేయాలని పిసిసి అధ్యక్షులు, ఏఐసిసి ఇన్చార్జులు కలసి నిర్ణయించడం జరిగిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఈవి శ్రీనివాస్ తెలపారు.