Neti Satyam
Newspaper Banner
Date of Publish : 31 July 2025, 4:50 pm Editor : Admin

ప్రభుత్వ స్థలం పై కబ్జా కోరాలు..పట్టించుకోని అధికారులు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం బాలాపూర్

*ప్రభుత్వ స్థలం పై కబ్జాకోరలు పట్టించుకోనీ అధికారులు*
బాలాపూర్ మండలం పరిధిలోని జిల్లెల్ల కూడా లో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనకాల ఉన్న సర్వే నెంబర్ 124 లో దాదాపు మూడు కోట్లు విలువచేసే 500 గజాల ప్రభుత్వ స్థలంను కొందరు కబ్జాదారులు ఆక్రమించుకొని ఆ స్థలంలో కంటైనర్ను పెట్టారు. ఆ యొక్క విషయం సంబంధిత రెవెన్యూ అధికారులకు తెలిసిన పట్టించుకోవడం లేదు. ఆ యొక్క ప్రభుత్వ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకొని దానిని కబ్జాదారుల నుండి కాపాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బాలాపూర్ మండల కార్యదర్శి ముకుందం గారి చంద్రశేఖర్ రెడ్డి, సిపిఎం పార్టీ నాయకులు వి శేఖర్ యాదవ్ లు అన్నారు. అదేవిధంగా మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాలను గతంలో అనేకమంది రాజకీయ నాయకులు వారి అనుచరులు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారని వాటిని సంబంధిత అధికారులు విచారణ జరిపి తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వం యొక్క సంక్షేమం మరియు ప్రభుత్వ స్కూళ్లు కార్యాలయాలు ఆసుపత్రులకు ఉపయోగించాలని ప్రభుత్వాన్ని కోరారు.