(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం ఖైరతాబాద్ ఆగస్టు 2 
ప్రజా పోరాటాలను ముందుకు తీసుకెళ్లగల సామర్థ్యం పెంచుకోవాలి
– సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ
మతతత్వ శక్తుల జోక్యాలను ప్రతిఘటించడం కోసం ప్రజా పోరాటాలను ముందుకు తీసుకెళ్లగల సామర్థ్యం పెంచుకోవాలని సిపిఐ పార్టీ శ్రేణులను సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ పిలుపునిచ్చారు. హైదరాబాద్, హిమాయత్ నగర్, సత్యనారాయణ రెడ్డి భవన్ లో శనివారం సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం కార్యవర్గ సభ్యులు పడాల నళిని అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఈ.టి. నరసింహ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ ప్రజా పునాదితో కూడిన బలమైన భారత కమ్యూనిస్ట్ పార్టీని ఎలా నిర్మించాలనే దానిపై దృష్టి పెట్టాలని కోరారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను ఏర్పరచుకొని, ప్రజా ఉద్యమాలను అభివృద్ధి చేయడానికి కొత్త నినాదాలు, వ్యూహాలు మరియు సంస్థాగత పని రూపాలను స్వీకరించడం అవసరం అని అన్నారు. మతతత్వ భావజాలాన్ని ఎదుర్కోవడానికి లౌకిక ప్రజాస్వామ్య విలువలను పెంపొందించగల సామాజిక మరియు సాంస్కృతిక కార్యకలాపాలను రూపొందించాలని ఈ.టి. నరసింహ కోరారు. సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్. ఛాయాదేవి మాట్లాడుతూ నాటి నిరంకుశ నిజాం పాలనా నుండి నేటి నయా బూర్జువా పాలకుల ప్రజా వ్యతరేక విధానాలను నిరసిస్తూ హైదరాబాద్ నగరంలో అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించిన చరిత్ర హైదరాబాద్ సిపిఐ కు ఉందని, ఆ స్ఫూర్తితోనే ఆగష్టు 14 న సిపిఐ హైదరాబాద్ జిల్లా మహాసభలు హిమాయత్ నగర్, సత్యనారాయణ రెడ్డి భవన్ లో నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలను విజయవంతం చేయాలనీ ఎస్. ఛాయాదేవి విజ్ఞాతి చేసారు. ఈ సమావేశంలో సిపిఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి. స్టాలిన్, జిల్లా కార్యవర్గ సభ్యులు జి. చంద్రమోహన్ గౌడ్, ఆర్. శంకర్ నాయక్, నిర్లేకంటి శ్రీకాంత్, ఎండి. ఒమర్ ఖాన్, ఎండి. సలీమ్, మామిడిచెట్ల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు