నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 2
భూదానం సుబ్బారావు కు జాతీయ పురస్కారం
హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా పుష్కరం అందజేత.
దేశ ప్రజలకు గుర్తింపుతేవడంతోపాటు వారికి గర్వకారణంగానూ జాతీయ పతాకం నిలుస్తుందని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటం వేళ మహాత్మాగాంధీ సూచనల మేరకు జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య చిరస్మరణీ యుడన్నారు.వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి త్యాగరాయ గానసభలో…పింగళి వెంకయ్య జయంతిని నిర్వహించారు.తెలంగాణ గాంధీస్మారక నిధి అధ్యక్షుడు, నాగర్ కర్నూల్ పట్టణవాసి, స్వాతంత్ర సమరయోధుడు గోవిందరాజు(భూదానం) వెంకటసుబ్బారావు కు పింగళి వెంకయ్య-వంశీ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేసి సన్మానించారు.ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షత వహించగా..ప్రముఖులు నరసింహం,పొత్తూరి సుబ్బారావు,వంశీ రామరాజు,రమాదేవి,ఫణి కశ్యప్,రాధా రాణి,మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు