(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం
ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దు పాటల సిడిని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు.
నేటి సత్యం హైదరాబాద్. ఆగస్టు 3
తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు, తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ ఆధ్వర్యంలో రూపొందించిన “ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దు” అనే పాటల సీడిని హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తన చాంబర్లో ఆవిష్కరించారు…
అనంతరం సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ దేశ యువత భవిష్యత్తు ప్రమాదంలో ఉందని, యువత సక్రమమైన మార్గంలో ఉంచవలసిన బాధ్యత మనందరి పైన ఉందని అన్నారు. నేడు గంజాయి డ్రగ్స్ మత్తులో కూరుకుపోయి పెద్ద సదులు చదవాల్సిన విద్యార్థులు యువత చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఇంకా గ్రామాల్లో పట్టణాల్లో,కాలేజీ, స్కూళ్లలో గంజాయి డ్రగ్స్ పై అవగాహన కల్పించాలని, పాటలు రాసిన రచయితను, పాడిన కళాకారులను అభినందించారు….