(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం నాగర్కర్నూల్ ఆగస్టు 3 
ఎస్సీల రిజర్వేషన్ శాతాన్ని 15 నుండి 18 శాతానికి పెంచాలి.
–బిఎంపి పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్.
తాడూరు మండల కేంద్రంలో బహుజన్ ముక్తి పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీల రిజర్వేషన్ శాతాన్ని 15 నుండి 18 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాలు,దళిత నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బిఎంపి పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన ఎస్సీల జనాభా అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని 15 నుండి 18 శాతానికి పెంచి స్థానిక సంస్థలలో,విద్యా ఉద్యోగాలలో ఎస్సీలకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని బహుజన్ ముక్తి పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 3 నుండి 10 వరకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ వ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.గత 10 సంవత్సరాల నుండి బహుజన్ ముక్తి పార్టీ,భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో ఓబిసి కుల గణన చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ శాతాని పెంచాలని చేసిన పోరాట ఫలితంగానే నేడు తెలంగాణలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్సు చేస్తూ చట్ట బద్దత కోసం చేస్తున్న ప్రభుత్వానికి స్వాగతం పలుకుతున్నామని తెలిపారు.అదే విధంగా తెలంగాణలో కుల గణన సర్వే ప్రకారం ఎస్సీల జనాభా 18 శాతం పైగా పెరిగిందని పెరిగిన జనాభాకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం 15 శాతం నుండి 18 శాతానికి రిజర్వేషన్ శాతాన్ని పెంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా,ఉద్యోగాల్లో రిజర్వేషన్ పెంచి రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పాలమూరు వలస లేబర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బాకీ బాల్ రాజు,దళిత దండు రాష్ట్ర కార్యదర్శి ఎత్తపు చంద్ర స్వామి,మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి చింత సత్తీ, భారత్ ముక్తి మోర్చా నాయకులు మీసాల మహెందర్, ఎర్రోళ్ల రవి తదితరులు పాల్గొన్నారు.