Neti Satyam
Newspaper Banner
Date of Publish : 03 August 2025, 1:34 pm Editor : Admin

అండర్ 11 జాతీయ రెస్లింగ్ పోటీలో ధ్రువం సత్య వర్మ కు రెండు బంగారు పథకాలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం.
అండర్ 11 జాతీయ రెజ్లింగ్ పోటీల్లో ధ్రువం సత్య వర్మ కు రెండు బంగారు పతకలు
ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

శేరిలింగంపల్లి ఆగస్టు 3 నేటి సత్యం

కొండాపూర్ కు చెందిన ధ్రువన్ సత్య వర్మ అండర్ 11 రెజ్లింగ్ పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించారు. అండర్ 11 రెస్లింగ్ పోటీలను చతిస్గడ్ల నిర్వహించినట్లు ధ్రువం సత్య వర్మ తెలిపారు ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆదివారం సత్య వర్మను తన నివాసంలో ఘనంగా సన్మానించారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ మాట్లాడుతూ పిల్లలకు చదువుతోపాటు క్రీడల్లో కూడా ప్రోత్సాహం ఇవ్వాలని తల్లిదండ్రులకు చెప్పారు ఇలానే మన దేశానికి మంచి పేరు తేవాలని భవిష్యత్తులో ఇంకా అనేక రకాల రంగాలలో ధ్రువం సత్య వర్మ విజయం సాధించాలని ఆశీర్వదించారు.
ధ్రువన్ సత్య వర్మ తల్లిదండ్రులను అభినందించారు ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు బలరామ్ యాదవ్ మరియు రాజమోహన్ రావు రమేష్ యాదవ్ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు