Neti Satyam
Newspaper Banner
Date of Publish : 03 August 2025, 3:13 pm Editor : Admin

హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించండి బీసీ సంఘం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శేర్లింగంపల్లి

హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం జాతీయ బి సి సంఘం అద్వర్యంలో ధర్నా

శేరిలింగంపల్లి నేటి సత్యం ప్రతినిధి: ఆదివారం రోజు జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన హాస్టల్ విద్యార్థి ,విద్యార్థినిలకు సొంత భవనాలు ఇతర సౌకర్యాలు, ప్యాకెట్ మనీ పెంపుదల కోసం ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన ధర్నా కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. కృష్ణయ్య మాట్లాడుతూ. పేద విద్యార్థి, విద్యార్థినిల హాస్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఫీజు రీయింబర్స్మెంట్ మరియు నెలకు 1000 రూ.. విద్యార్థులకు అందించాలని నెలకు ఒకసారి స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు, ముఖ్యమంత్రితో సహా హాస్టల్ లను మరియు గవర్నమెంట్ స్కూలు సందర్శించాలని ఆయన డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు వల్లెపు మాధవరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3, సంవత్సరాలు దగ్గరికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలను పట్టించుకోవట్లేదు అని తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్. హాస్పిటల్స్ లో వర్షాకాలంలో నీళ్లు రావడం వల్ల కలిగే అనర్ధాలు చాలా ఉన్నాయని గవర్నమెంట్ కాలేజీలలో స్కూల్ లో విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు కూడా లేవని టాయిలెట్ రూములు లేకపోవడం సిగ్గుచేటని .ఉన్న ప్రదేశాలలో గోడలు కూలిపోయి బాత్రూంలు గలీజ్ అయిపోయాయని రాష్ట్రవంతట స్కూల్లో పై విద్యార్థుల భవిష్యత్తుపై మంచి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని. లేనియెడల బీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర లో ప్రతి జిల్లాలో ధర్నాలు చేస్తామని మాధవరావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంగం రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరియు హైదర్ నగర్ 123 డివిజన్ అధ్యక్షులు బాలకృష్ణ పాల్గొని విద్యార్థి విద్యార్థినులకు మద్దతు తెలపడం జరిగింది.