(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం చేవెళ్ల ఆగస్టు 4 
*సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా వడ్ల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక*
ఆగస్టు 2వ తేదీన మొయినాబాద్ మండల కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ )రంగారెడ్డి జిల్లా 17వ మహాసభ ఘనంగా జరిగింది ఈ మహాసభలో కందవాడ గ్రామానికి చెందిన వడ్ల సత్యనారాయణ ను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ మహాసభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు గారు హాజరైనారు జిల్లా కార్యదర్శిగా మూడవసారి పాలమాకుల జంగన్న గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది 23 మందితో నూతన కార్యవర్గం ఏర్పడింది ఈ సందర్భంగా వడ్ల సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రజాసంఘాల నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు నా ఎన్నికకు సహకరించిన జిల్లా కార్యదర్శి పాలమకుల జంగన్న గారికి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పర్వతాలు అన్నగారికి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి కే రామస్వామి అన్న గారికి పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం ప్రభు లింగం అన్నగారికి మరియు హాజరైన ప్రతినిధులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు