Neti Satyam
Newspaper Banner
Date of Publish : 05 August 2025, 10:20 am Editor : Admin

సీజన్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం ఆగస్టు 5

వర్షాకాలంలో వచ్చే సిజనల్ వ్యాధులు ప్రబల కుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సుచించిన..చందానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు..

నేటి సత్యం. చందానగర్. ఆగస్టు 5

చందానగర్ డివిజన్ పరిధిలో చందానగర్ మున్సిపల్ కమిషనర్ శశికళ గారు శానిటేషన్ ఎంటామాలజి అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు మన్ సున్ శానిటేషన్ స్పేషల్ డ్రైవ్ నిర్వహించారు..చందానగర్ వేముకుంట కాలనీ పాదయాత్ర చేపట్టారు..వర్షాకాలంలో వ్యాపించే వ్యాధులపై ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు..

ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కమిషనర్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు.రోడ్లపై,ఇళ్ల ముందు చెత్త వేయకుండా, స్వచ్ఛ పారిశుద్ధ్య ఆటోలలోనే చెత్తను వేయాలని ప్రజలను కోరారు.పారిశుద్ధ్య కార్మికులు విధులకు రాకపోతే లేదా ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు..చెత్త పేరుకుపోతే జిహెచ్ఎం సి ఆన్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటారని వెల్లడించారు..
ప్రజల సహకారంతోనే పరిశుభ్రమైన సమాజాన్ని నిర్మించగలమని అన్నారు..స్వచ్ఛ హైదరాబాద్ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రఘునాథ్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు రవింద్రర్ రావు లక్ష్మినారాయణ గౌడ్,అక్బర్ ఖాన్,యుసుఫ్ ఖాన్ కాలనీ నరేంద్ర భళ్లా స్థానిక నాయకులు శానిటేషన్ అధికారులు రవి కుమార్ ఏసిపి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు..