Neti Satyam
Newspaper Banner
Date of Publish : 05 August 2025, 2:42 pm Editor : Admin

ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్సీ మల్క కొమరయ్య




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం. పెద్దపల్లి జిల్లా ఆగస్టు 5

కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలను ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శోభ గారితో పలు అంశాలపై ఆయన ఆరా తీశారు. హాస్టల్‌లో తగిన వసతులు లేకపోవడాన్ని గుర్తించిన ఆయన, అదనపు గదుల నిర్మాణానికి DMFT నిధుల నుంచి రూ. 20 లక్షల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.