(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం నాగర్ కర్నూల్ ఆగస్టు 6 
*నాగర్ కర్నూల్ జిల్లా….*
*తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ జయంతి*
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం రోజున కలెక్టరేట్ ఆఫీస్ లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిన మహా జ్ఞాని, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ జయంతిని బీసీ సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి *నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ భదావత్ సంతోష్ , ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి* , జిల్లా అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ కార్యాలయంలోని అన్ని శాఖల జిల్లా అధికారులు మరి వారితో పాటు సిబ్బంది మరియు ప్రజా సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. దీని పట్ల బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి హర్షం వ్యక్తం చేశారు.