(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం షాద్నగర్ ఆగస్టు 6 
*బడుగు జీవుల గుండెల నిండా.. గద్దరన్న ఉద్యమ జెండా..*
*కాంగ్రెస్ ఆదివాసి గిరిజన కోఆర్డినేటర్ పి రఘునాయక్*
*గద్దర్ అన్నకు కాంగ్రెస్ నాయకులు, ప్రజాసంఘాల ఘన నివాళులు..*
*నేడు తెలంగాణ గుండె చప్పుడు గద్దర్ వర్ధంతి*
గద్దర్.. అంటే పేరు కాదు ఓ ఉద్యమం.. మనిషి కాదు.. ఒక చైతన్య గీతం.. ఉద్యమకారుడు కాదు.. తెలంగాణ ప్రజల గుండెచప్పుడు.. అంటూ కాంగ్రెస్ గిరిజన, ఆదివాసి కోఆర్డినేటర్ పి. రఘు ప్రశంసించారు. ప్రజా కవి గద్దర్ రెండవ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక మండల పరిషత్ ముందు గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈనెల 3న ప్రారంభించాల్సిన గద్దర్ విగ్రహావిష్కరణ వాయిదా పడిందని అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ కార్యక్రమానికి రావాల్సి ఉందని, బీసీ గర్జన లాంటి కార్యక్రమాలు ఉన్నందున ఆయన రాలేకపోయారని స్పష్టం చేశారు. త్వరలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని స్పష్టం చేశారు. ప్రధాన ఒక్కగా పేరుపొందిన గద్దర్ బడుగు వర్గాలకు కూడు,గుడ్డు,ఇల్లు ఉండాలని కోరుతూ తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారని కొనియాడారు. తన మాటలను పాటలు గా అమలు ఎంతోమంది యువకుల్లో ఆయన స్ఫూర్తిని నింపారని ప్రశంసించారు. తెలంగాణ సాధించాలని సంకల్పించి ఉద్యమంలో కాలికి గజ్జ కట్టి ఆటపాటలతో చైతన్యం తెచ్చిన మహా నాయకుడు అని అన్నారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆయన కోరుకున్నారని, కానీ దురదృష్టవశాత్తు అంతలోనే ఆయన దివంగతులయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన ఆయన చూడలేకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికలకు ముందు చివరిసారి రాహుల్ గాంధీని కలిసి ప్రజాపాలన ఎలా ఉండాలన్న విషయాలను ఆయన వివరించారని గుర్తు చేసుకున్నారు. ఆయన లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఆయన అడుగుజాడల్లో నడుస్తుందని, ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య, మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, చెంది తిరుపతిరెడ్డి, మహమ్మద్ ఇబ్రహీం, మార్కెట్ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి, మసూద్ ఖాన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు..RK