Neti Satyam
Newspaper Banner
Date of Publish : 06 August 2025, 8:58 am Editor : Admin

పార్టీకి తీరని లోటు కామ్రేడ్ అయోధ్య గారి అకాలమరణం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శంషాబాద్. ఆగస్టు 6

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కామ్రేడ్ అయోధ్య గారు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా దిగ్భ్రాంతి కలిగించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు
శంషాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య గారి తో పాటు రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు పుస్తకాల నర్సింగ్ రావు గారు రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు ఓరుగంటి యాదయ్య పై మీద జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ప్రవలింగం బుద్ధుల జంగయ్య టి రామకృష్ణ పల్నాటి యాదయ్య బాతరాజు నరసింహ నరసింహారెడ్డి ఆర్ యాదగిరి ఎం ఏ రియాజ్ పి శివకుమార్ శంషాబాద్ మండల కార్యదర్శి నర్రగిరి కందుకూరు మండల కార్యదర్శి కే రాజు జిల్లా సమితి సభ్యులు స్వామి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గ్యార క్రాంతి జిల్లా నాయకులు తేజ నితీష్ తదితరులు అయోధ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు