నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 6
సూర్యాపేట వద్ద రోడ్డు ప్రమాదంలో ఈరోజు తెల్లవారుజామున ఉదయం 5.30 గంటలకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య మృతి చెందడం జరిగింది.
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బి అయోధ్య మృతి పట్ల సిపిఐ రాష్ట్ర సమితి నుండి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మృతి పట్ల సాంబశివరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి రాష్ట్ర పార్టీ, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, పినపాక నియోజకవర్గానికి తీరని లోటని అన్నారు. ఆయన నిబద్దతకు మారుపేరని, ప్రజల కోసం అనేక పోరాటాలు చేసిన పోరాట యోధులు అన్నారు. ఆయన అభిప్రాయాలను నిర్మొహమాటంగా , నిక్కచ్చిగా చెప్పేవారన్నారు. నిజాయితీగా మాట్లాడేవారని తెలిపారు. అయోధ్యకు సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతులు తెలిపారు.