నేటి సత్యం చందానగర్ ఆగస్టు 6
మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని చందానగర్ డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు తేలిపారు..
చందానగర్ డివిజన్ పరిధిలోని వేంకటాద్రీ నగర్ లో చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శశికళ మరియు శానిటేషన్ ఎంటామాలజి అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు మన్ సున్ స్పేషల్ డ్రైవ్ నిర్వహించారు..వర్షాకాలంలో ప్రబలే అంటు వ్యాధులు గురించి ప్రజలకు తేలుపుతు అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు కాలని వాసులకు అవగాహన కల్పించారు..
ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబల కుండా ప్రజలు కాలని వాసులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు..రోడ్లపై కాలనిలోని ఖాళీ స్థలాల్లో చేత్తను వేయకుండా స్వచ్ఛ పారిశుద్ధ్య ఆటోలలోనే చెత్తను వేయాలని ప్రజలను కోరారు..దోమల నివారణకు ఇళ్లలో చేట్ల కుండిలను వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలని కాలని ఖాళీ ప్రదేశంలో నీరు నిల్వ ఉండకుండా చుసుకోవాలని సుచించారు..