నేటి సత్యం. శేర్లింగంపల్లి
*స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు,తెలంగాణ స్ఫూర్తి ప్రదాత జయశంకర్ సార్..చందానగర్ డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు..*
నేటి సత్యం చందానగర్ ఆగస్టు 6
చందానగర్ హుడా కాలనిలో విశ్వ బ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చందానగర్ డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు పాల్గొని జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళులు అర్పించారు..
ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ సాధనలో ప్రోపేసర్ జయశంకర్ సార్ కిలక పాత్ర పోషించారని ఆయన సేవలను స్మరించుకున్నారు..తెలంగాణ రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడని కొనియాడారు..1952 నాటి నాన్-ముల్కీ ఉద్యమం నుంచి ఆయన తెలంగాణ కోసం పోరాడుతూనే ఉన్నారు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను మేధోపరంగా, ఆర్థికపరంగా,సామాజికపరంగా విశ్లేషించి,ప్రజలకు, విద్యార్థులకు ఆ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తేలిపారు.