నేటి సత్యం కొండాపూర్ ఆగస్టు 7
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి అని అభిహార నుంచి వచ్చిన చేనేత నిపుణులు శ్రీమతి ముళ్ళపూడి సుధారాణి అన్నారు
చీరలు నేసే క్రమంలో చేనేత కార్మికుల నైపుణ్యతని,శ్రమని గురించి వివరించారు. ఆరోగ్యం, మన్నిక, అందం, సున్నితత్వం కలిగిన చీరలు మహిళల్ని ఆకట్టుకున్నాయి.
చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సంక్షేమ కేంద్రం తరపున చేనేత వస్త్ర ప్రదర్శన జరిగింది.
ముందుగా సంక్షేమ కేంద్రం విద్యార్థినులు వృద్ధాశ్రమ మహిళలు 100 మందికి పైగా ఊరేగింపుగా స్లోగన్లు ఇస్తూ ముందుకు నడిచారు “చేనేతను కాపాడుకుందాం! చేనేత కార్మికులను ప్రోత్సహిద్దాం!!” అనే నినాదాలు మిన్నంటాయి.
ఈ కార్యక్రమంలో ఉష (అడ్వైజర్) పి జె చంద్ర శేఖర్ (సి ఆర్ ఫౌండేషన్ ఆఫీస్ బేరర్), డాక్టర్ ప్రతిభ, కల్పన జోషభట్ల (ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్), వంకా లక్ష్మి, ఆరుట్ల మమత,లలిత పాల్గొన్నారు.
డాక్టర్ బి వి విజయలక్ష్మి ,డాక్టర్ కూనంనేని రజని, డాక్టర్ అరుణ, మంజరి, మెహర్ ఫాతిమా, విజయ నర్సింగ్, జ్యోత్స్న కూడా హాజరయ్యారు.
వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమ ఉపాధి అని పిజె చంద్రశేఖర్ అన్నారు .చేనేత వస్త్రాలపై జిఎస్టి తొలగించాలని ప్రతిభ డిమాండ్ చేశారు.
శ్రీమతి లలిత వందన సమర్పణ చేశారు.