చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
నేటి సత్యం కొండాపూర్ ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి అని అభిహార నుంచి వచ్చిన చేనేత నిపుణులు శ్రీమతి ముళ్ళపూడి సుధారాణి అన్నారు చీరలు నేసే క్రమంలో చేనేత కార్మికుల నైపుణ్యతని,శ్రమని గురించి వివరించారు. ఆరోగ్యం, మన్నిక, అందం, సున్నితత్వం కలిగిన చీరలు మహిళల్ని ఆకట్టుకున్నాయి. చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సంక్షేమ కేంద్రం తరపున చేనేత వస్త్ర ప్రదర్శన జరిగింది. ముందుగా సంక్షేమ కేంద్రం...