నేటి సత్
*రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పటల్ లో సిబ్బంది కొరత*
నేటి సత్యం. కొండాపూర్. ఆగస్టు 7
జిల్లా ఆస్పత్రిలో సిబ్బంది లేక రోగుల రోదన. డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు.
కొండాపూర్ మజీద్ బండలో ఉన్న రంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో సిబ్బంది కొరత రోగులకు శాపంగా మారిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ ఆరోపించారు. ఈ రోజు ఒక మహిళా గత ఆదివారం ఉదయం ఒక బిడ్డకు జన్మించిన సందర్భంగా పలకరించడానికి వెళ్లిన ఆయన అక్కడి సిబ్బంది తమకు స్థాయికి మించి సర్వీసు చేస్తున్నామని ఎన్నో సార్లు వైద్య అధికారులకు విజ్ఞప్తి చేశాము ఐనా సరే అన్ని రకాల సిబ్బందినీ నియామకం చేయలేదని పేసెంట్స్ తమను తప్పుగా భావించి ఇబ్బంది పెడుతున్నారని శ్రీకృష్ణ ముందు ఆవేదన వ్యక్తం చేశారనీ ఆయన తెలిపారు. అసలే వర్షాలు కురిసి రక రకాల వ్యాధుల బారినపడి జిల్లా ఆస్పత్రిలో చికిత్స కోసం వస్తె ఇక్కడ సరైన వైద్యం అందడం లేదని రోగులు ఆందోళనకు గురవుతున్నారని కాబట్టి ప్రభుత్వం వెంటనే జిల్లా ఆస్పత్రిలో సరిపోను వైద్య సిబ్బందిని, అధికారులను నియామకం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని శ్రీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.