నేటి సత్యం శేర్లింగంపల్లి ఆగస్టు 8
*భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయండి*
*జిల్లా కార్యవర్గ సభ్యులు సిపిఐ రామకృష్ణ*
తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు ఈనెల 19 నుండి 22 వరకు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ గాజులరామారంలో జరుగు మహాసభల గోడపత్రికను ఈరోజు శేర్లింగంపల్లి సిపిఐ పార్టీ. కార్యాలయంలో మహాసభల వాల్ పోస్టర్ విడుదల చేసిన జిల్లా కార్యవర్గ సభ్యులు సిపిఐ రామకృష్ణ..
భారతదేశా స్వాతంత్రం ఉద్యమంలో. నేటి తెలంగాణ ఉద్యమంలో. ఎంతోమంది కమ్యూనిస్టులు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడినారు..
ప్రజా సమస్యలు ఉన్నంతవరకు కమ్యూనిస్టు పార్టీ ఉంటుంది.
దేశంలోనే 100 సంవత్సరాల నిండిన పార్టీ ఏదైనా ఉంది అంటే. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఒకటే
తెలంగాణ. లో నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ సిపిఐ. వందల ఎకరాలు భూములు పంచి తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయుట కొరకు కమ్యూనిస్టులు ఎంతో క్రియాశీలమైన పోరాటాలు నిర్వహించినారు దాని ఫలితమే ఈరోజు తెలంగాణ ప్రాంతం భారత దేశంలో విలీనమైనది .
తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు. రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయాలు చేయబోతోంది రాష్ట్ర ప్రజలకు కావలసిన హక్కుల కోసం వాటి పరిష్కార కోసం ఉద్యమ ప్రణాళిక చేయబోతుంది ఈ మహాసభలను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి
ఈ కార్యక్రమంలో సిపిఐ రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు కె చందు యాదవ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం సహాయ కార్యదర్శి. కే సుధాకర్ మండల నాయకులు తుపాకుల రాములు ఎస్ నారాయణ సురేష్ ముదిరాజ్. రఘు భాస్కర్ ఎం వెంకటేష్ కే కాసిo మహిళా కామ్రేడ్ సురేఖ ఏఐఎస్ఎఫ్ నాయకులు నితీష్ తేజ దేవేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు