Neti Satyam
Newspaper Banner
Date of Publish : 08 August 2025, 1:16 pm Editor : Admin

కొత్త రేషన్ కార్డుల.. పంపిణీ ఎమ్మెల్యే రాజేష్ రెడీ!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

నాగర్ కర్నూల్ కేంద్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

నేటి సత్యం నాగర్ కర్నూల్ ఆగస్టు 8

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు డాక్టర్. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు ,జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్దిదారులకు ఆహార భద్రత పథకం కింద కొత్త రేషన్ కార్డులు అందజేశారు..

ఈ సందర్భంగా *ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ..*

గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేదల పట్ల తీవ్ర అన్యాయం చేశాయి. గత పది సంవత్సరాలపాటు రాష్ట్రంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా జారీ చేయలేదు. పేదలు ఎన్నిసార్లు ప్రయత్నించినా, వారి మొరల్ని పెదవిపైకి తీసుకురాలేకపోయారు. కాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనలో, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం పేదల కష్టాలను అర్థం చేసుకుని, వారి సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది.

ఆహార భద్రతతో పాటు, రేషన్ కార్డు ద్వారా పేదలకు అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయని, ఇది న్యాయమైన హక్కుగా పరిగణించాలని అన్నారు. పల్లె ప్రజలకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు..

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు గారు ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ గారు ,అసెంబ్లీ ప్రెసిడెంట్ తిరుపతి గౌడ్ గారు ,ప్రజాప్రతినిధులు, అధికారులు, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మండల కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, లబ్దిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లబ్దిదారులు తమకు రేషన్ కార్డు అందించిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.