నేటి సత్యం
యంగo పల్లి ఎత్తిపోతల పథకము పై
నిజము గా పిడుగులు పడి కూలి పోయినదా…?
కొల్లాపూర్, ఆగస్టు 8 (నేటి సత్యం ప్రతినిధి: యస్.పి.మల్లిఖార్జున సాగర్).
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గము పెంట్లవెల్లి మండలం లోని మల్లేశ్వరం గ్రామం దగ్గర నిరుపయోగం గా ఉన్న యంగంపల్లి ఎత్తిపోతల పథకం వై నిజము గా పిడుగులు పడి కూలిపోయిందా..? లేక ఏమైనా విద్రోహ చర్యల మూలము గా కూలిపోయిందా..? అని కొల్లాపూర్ ప్రాంత ప్రజలు సమాధానము దొరకని భేతాళ ప్రశ్నలతో విస్మయం చెందుతున్నారు.
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గము (మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిత్యం) పెంట్లవెల్లి
మండలం లోని మల్లేశ్వరం గ్రామం దగ్గర కృష్ణానది నీటి పై నిర్మించిన యంగం పల్లి ఎత్తిపోతల పథకం గత 29 ఏళ్లు గా నిరుపయోగము గా వృద్ధా గా పడి ఉన్నది.
కాగా అట్టి ఎత్తి పోతల పథకము పై గురువారం (7-8-2025) రోజు రాత్రి కురిసిన వర్షం లో పిడుగులు పడి అట్టి ఎత్తిపోతల పథకం కూలిపోయినది అని మల్లేశ్వరం యoగంపల్లి వేముకల్ తదితర గ్రామాల ప్రజలు శుక్రవారం ఉదయం తెలియజేయడం తో ఎత్తిపోతల పథకం కూలిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చినది.
1-9-1994 లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ, భూగర్భ జల శాఖ మంత్రిగా శంకర్రావు, నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు గా (ప్రస్తుత పార్లమెంటు) డాక్టర్ మల్లు రవి, అప్పట్లో కొల్లాపూర్ శాసనసభ్యులుగా ఉన్న కొత్త రామచంద్రరావు ల ఆధ్వర్యం లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాం లో మల్లేశ్వరం గ్రామ సమీపం లో కృష్ణా నది తీరాన మధ్యమాన తిమ్మన్న భూమి లో యంగంపల్లి ఎత్తిపోతల పథకం నకు శంకుస్థాపన చేశారు.
ఈ ఎత్తిపోతల పథకం ద్వారా మల్లేశ్వరం వేంకల్ యంగంపల్లి తండా తదితర గ్రామాలలోని 500 ఎకరాలకు సాగునీరు అందిస్తూ 600 మంది రైతులకు ప్రయోజనము చేకూర్చేందుకై అట్టి ఎత్తిపోతల పథకం ను కృష్ణానది తిరుగు జలాలపై చేపట్టడం జరిగింది.
మొదట్లో ఎత్తి పోతల పథకం పనులు కొద్దిగా జరిగిన పనులు నిలిచి పోవడం తో ఆ తరువాత కొల్లాపూర్ ఎమ్మెల్యే గా ఎన్నికైన (ప్రస్తుత కొల్లాపూర్ ఎమ్మెల్యే మంత్రి) జూపల్లి కృష్ణారావు హయాము లో మరికొన్ని నిధులను ఎత్తిపోతల పథకము నిర్మాణము నకు మంజూరు చేసి అధికారులు పనులు చేపట్టారు.
అయితే ఆ పథకం పూర్తి కాక పోవడం ఆశించిన మేరకు 500 ఎకరాలకు సాగునీరు అందించక దాదాపు 29 ఏళ్లుగా ఎత్తిపోతల పథకం నిరుపయోగముగా వృధాగా పడి ఉన్నది.
కాగా గురువారం రోజు రాత్రి కురిసిన భారీ వర్షాల లో పిడుగులు పడి ఎత్తి పోతల నిర్మాణం కూలి పోయిదని బాహ్య సమాజం కు ఎరుక అయినది.
అయితే పిడుగులు పడి ఎత్తి పోతల పథకం కూలి పోయిదని ప్రచారం జరుగుతున్నా ఎత్తి పోతల పథకం కూలి పోయిన దగ్గర పిడుగు పడిన ఆనవాలు ఏమి లేవని అక్కడి పరిస్థితులను చూసిన వృద్ధులు రైతులు తమ అనుమానాలను సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
పిడుగు పడి ఎత్తి పోతల పథకం కూలిపోయిన దగ్గర ఉన్న విద్యుత్ స్తంభాల వైర్లు తెగి పడలేదు..?, ఎత్తిపోతల పథకం కూలిన దగ్గర ఉన్న స్తంభాలు నిటారు గా అలాగే ఉన్నాయి..? పై కప్పు మాత్రమే కూలిపోయాయి..? అలాగే ఎత్తిపోతల పథకం స్తంభాలకు పిడుగు పడినప్పుడు వెలువడే వేడి విద్యుత్ అయస్కాంత శక్తి వలన స్తంభాలకు ఎలాంటి మసకబారిన సంఘటనలు కూడా లేవు.?
అలాగే పిడుగు పడి నప్పుడు ఉద్భవించే వేడి కి తాకిడి కి ఎత్తి పోతల పథకం పరిసర ప్రాంతాలు ధ్వంసం అయినట్లు కానీ,పిడుగు తాకిడి కి ఎత్తి పోతల పథకం కింద నిలువ ఉన్న నీటిలో అలజడులు పుట్టి నీరు పైకి ఎగిసి పరిసర ప్రాంతాలు బురుద,ఇసుక మాయం గా మారి పోవాలి..? కానీ పిడుగు పడి ఎత్తి పోతల పథకం కూలిన ప్రాంతం పచ్చని మడి కట్లు ఏ మాత్రం చెక్కు చెదర క అలాగే పచ్చగా ఉన్నాయి.
ఇలాంటి అక్కడి వాతావరణం ను ఎత్తి పోతల పథకం కూలిన పరిసరాలను పరిశీలించిన సామాన్యులు సైతం అసలు పిడుగు (లు) ఎత్తి పోతల పథకం పైన పడినవా..? పిడుగులు పడే ఎత్తి పథకం కూలి పోయినదా..? పిడుగులు పడి తే, పిడుగులు పడి ఎత్తి పోతల పథకం కూలి పోతుంటే ఆ శబ్దాలు మాకు ఎందుకు వినిపించే లేదని, పిడుగు పడి నట్లు తమ సమీప గ్రామాల లోని తమకు పిడుగు పడినప్పుడు వెలువడే వెళ్తురు కనిపించలేదని యoగంపల్లి ఎత్తిపోతల పరిసర గ్రామాల ప్రజలు తమ అనుమానాలను ప్రశ్నలను వ్యక్తం చేశారు.
కాగా గురువారం రాత్రి కురిసిన వర్షాలలో పిడుగులు పడి యంగంపల్లి ఎత్తిపోతల పథకం కూలిపోయిందని శుక్రవారం వార్తలు వెలువడిన నేపథ్యం లో ఎత్తిపోతల పథకం కూలిపోయిన సంఘటన ను అధికారులు సందర్శించారా..? క్షేత్రస్థాయి లో విచారణ చేశారా..? ఎన్ని పిడుగులు పడితే ఎత్తిపోతల పథకం కూలిపోయింది..? అసలు పిడుగులు పడినాయా..? లేక ఎవరైనా కావాలని ఎత్తిపోతల పథకము ను కూలగొట్టారా..?? అనే విషయాల గురించి తగిన సమాచారం తెలుసుకొనేందుకు కొల్లాపూర్ ఆర్డీవో 9154100268 కు ఫోన్లో సంప్రదించగా ఆ విషయం గురించి పెంట్లవెల్లి తహసీల్దారును అడగండి వారే విచారణ చేస్తున్నారని చెప్పారు.
దాంతో పెంట్లవెల్లి మండల తహసీల్దార్ 9100904711 కు ఎన్ని పర్యాయాలు ఫోన్ చేసినా , గిర్దావర్ ను ఎంక్వయిరీ కి మల్లేశ్వరం పంపించామని ఒకసారి, తాము నాగర్ కర్నూల్ లో మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళామని ప్రస్తుతం ఎత్తిపోతల పథకం కూలిపోయిన ప్రాంతానికి విచారణకు వెళుతున్నామని శుక్రవారం సాయంత్రం 6.30 వరకు సమాధానాలు ఇస్తూ వచ్చారు కానీ యంగం పల్లి ఎత్తిపోతల పథకం కూలిపోయిన సంఘటన గురించి గానీ కూలిపోవడానికి గల కారణాల గురించి గానీ పెంట్లవెల్లి మండల అధికారులు పవర్ న్యూస్ విలేకరి యస్.పి. మల్లికార్జున సాగర్ కు తెలియజేయ లేదు.