నేటి సత్యం
సౌభాగ్యం ను సంపదలను కల్పించాలని శ్రీ వరలక్ష్మి కి పూజలు..
కొల్లాపూర్, ఆగస్టు 8 (నేటి సత్యం ప్రతినిధి:యస్.పి.మల్లిఖార్జున సాగర్)
తమకు సుమంగళి సౌభాగ్యమును, సిరి సంపదలను ఆయురారోగ్యాలను కల్పించాలని తమ పిల్లలు ఆరోగ్య వంతం గా జీవించేందుకు చల్లని దీవెనలు ఇవ్వాలని మహిళలు ముత్తయిదువలు శ్రీ వరలక్ష్మీ మాత కు శ్రావణ శుక్రవారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లోని శ్రీ మాధవ స్వామి దేవాలయం లో అర్చకులు దుర్గి సుబ్బరాయ శర్మ ఆధ్వర్యం లో మహిళలు శుక్రవారం వేకువ జాము నుండే దేవాలయము నకు తరలివచ్చి దేవతామూర్తులను సందర్శించుకుని శ్రీ వరలక్ష్మి వ్రతము ను భక్తి శ్రద్ధలతో ఘనం గా నిర్వహించుకున్నారు.
వరలక్ష్మీ వ్రత అనంతరం ముత్తైదువలు ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చుకుంటూ పసుపు కుంకుమలను, పండ్లు పలాలు ఇచ్చుకుంటూ తమ ను దీవించమని ముత్తయిదువులను కోరుకున్నారు.