కొల్లాపూర్ లో ఆదివారం నీటి సరఫరా బంద్.. మున్సిపాలిటీ కమిషనర్ ముందస్తు హెచ్చరిక…
కొల్లాపూర్, ఆగస్టు 9 (నేటి సత్యం ప్రతినిధి:యస్.పి.మల్లిఖార్జున సాగర్)
కొల్లాపూర్
మున్సిపల్ (అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రము) లో ఆదివారం (10-8-2025)రోజు తాగు నీరు సరఫరా కాదని ప్రజలు గుర్తించి ముందస్తు గా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కొల్లాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ చంద్ర శేఖర్ రావు కొల్లాపూర్ పట్టణ ప్రజలను హెచ్చరిస్తూ విజ్ఞప్తి చేశారు.
కొల్లాపూర్ పట్టణ ప్రజలకు
సింగోటం నుండి 🚰నీటి సరఫరా చేయు పైపు లైన్ సెయింట్ మేరీ స్కూల్ చౌరస్తా దగ్గర హైవే పనులు చేస్తున్ననప్పుడు డ్యామేజీ కావడము జరిగినదని హైవే పనులు చేస్తున్న వారు తెలియజేసినారు అని, డ్యామేజ్ అయిన పైప్ లైన్ కు రిపేరు పనులు 🛠️ చేస్తున్నామని,దీని వల్ల 10.08.2025 (ఆదివారము) రోజు నీటి సరఫరా కు అంతరాయం కలుగును🚱 అని కమిషనర్ చంద్ర శేఖర్ రావు కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి లోని ప్రజలకు తెలియజేశారు.
కావున కొల్లాపూర్ పట్టణ ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని తాగు నీటి కి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని కొల్లాపూర్ మున్సిపాలిటీ సిబ్బంది కి సహకరించాలని కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి లోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.