* నేటి సత్యం చందానగర్ ఆగస్టు 10
*
రైల్వే స్టేషన్ పార్కింగ్ లో ప్రైవేట్ స్కూల్ బస్సులు నిలుపుట గురించి
చందానగర్ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద చైతన్య ప్రైవేట్ స్కూల్ బస్సులకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్న రైల్వే స్టేషన్ పార్కింగ్ గుత్తేదారు
ప్రయాణికుల సౌకర్యార్థమై చందానగర్ హుడా కాలనీ లోని రైల్వేస్టేషన్ వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసిన రైల్వే డిపార్ట్మెంట్ ఇట్టి పార్కింగ్ స్థలాలకు టెండర్లు పిలిచి ఎవరైతే నిత్యము రైలులో ప్రయాణం చేస్తారో వారి వాహనములు నిలుపుకొనుట కొరకు పార్కింగ్ స్థలం ఉన్నది కానీ ఇక్కడ పార్కింగ్ కాంట్రాక్టు టెండర్ దక్కించుకున్న గుత్తేదారు ప్రైవేటు స్కూలు బస్సులు నెలకు కిరాయికు ఇట్టి స్థలాన్ని ఇచ్చినాడు ఇది ఎంతవరకు సబబు అని నిరంతరం ప్రజల కోసం పరితపించే మిద్దెల మల్లారెడ్డి ప్రశ్నిస్తున్నాడు ఇట్టి బస్సుల వలన మా హుడా కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరియు ప్రయాణికులు వారి వాహనములను నిలుపుదామంటే అక్కడ స్థలము లేకుండా పోతుంది ఒక్కొక్క బస్సుకు రోజుకు 200 ల చొప్పున నెలకు 6000 రూపాయలు కిరాయి తీసుకుంటూ జేబులు నింపుకుంటున్న గుత్తే దారు ప్రైవేటు స్కూలు చైతన్య స్కూల్ వారి బస్సులకు వారు వారి స్కూల్ వద్ద పార్కింగ్ స్థలం లేనప్పుడు స్కూలు సమీపంలో ఎక్కడైనా స్థలాన్ని తీసుకోవాలి కానీ ఇలా రైల్వే స్టేషన్ కు సంబంధించిన పార్కింగ్లో పెట్టడం ఎంతవరకు సమంజసం ఇట్టి అన్యాయాన్ని పట్టించుకునే నాధుడే లేడా ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయిన మిద్దెల మల్లారెడ్డి పత్రికల ద్వారా సంబంధిత అధికారులను అడుగుతున్నాడు ప్రశ్నిస్తున్నాడు కావున వెంటనే సంబంధిత అధికారులు పరిశీలించి ఇట్టి గుత్తే ధారుపైన చర్య తీసుకుని ప్రజలకు న్యాయం చేయగలరని పత్రికల ద్వారా కోరుతున్నాను
బస్సుల బారి నుండి మా హుడాకాలనీ ని రక్షించగలరని అధికారులను కోరుతున్నాను లేనియెడల న్యాయపరమైన చర్యలు తీసుకునేలా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలియపరుస్తున్న మిద్దెల మల్లారెడ్డి