మహబూబునగర్ జిల్లాలో యుదేక్షగా దొంగతనాలు
మహబూబునగర్ లో నిద్ర పట్టని జనం
మొక్కుబడిగా పోలీసుల పెట్రోలింగ్
రాత్రిపూట ఎస్పీ తనిఖీలు అయినా దొంగతనాలు
మహబూబునగర్ ప్రతినిధి/ RK ఆగస్టు ( నేటి సత్యం
)
సులభంగా డబ్బు సంపాదించాలని లక్ష్యంతో ఈ మధ్యకాలంలో ఎంతోమంది దొంగతనాలు దోపిడీలు. చివరకు బ్యాంకులను కూడా దోపిడీ చేస్తున్నారు. గత రెండు రోజుల నుంచి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టిస్తూ దర్జాగా దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జిల్లా ఎస్పీ డి .జానకి నిరంతరం శాంతి భద్రతతో పాటు రాత్రి వేళలో స్వయంగా రంగంలోకి దిగి బస్టాండ్ రైల్వే స్టేషన్ తో పాటు న్యూ టౌన్. గడిగారం చౌరస్తా. తెలంగాణ చౌరస్తా తో పాటు జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ డి.జానకి పెట్రోలింగ్ నిర్వహిస్తూ అనుమానితులను ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తున్నప్పటికీ దొంగలు జిల్లా ఎస్పీ తనిఖీలను పోలీసుల పెట్రోలింగ్ కూడా లెక్కచేయకుండా దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను నిద్ర పట్టకుండా చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో రాత్రిపూట రక్షణ కరువైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసుల పెట్రోలింగ్ లోపం వల్లనే దొంగతనాలు జరుగుతున్నాయని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో మాత్రమే పెట్రోలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని పట్టణ శివారులో గల కాలనీల పైన దృష్టి పెట్టడం లేదని ప్రజలు అంటున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న బండమీదిపల్లి. మోతి నగర్. హౌసింగ్ బోర్డ్. అప్పనపల్లి. ఏనుగొండ. కేటీఆర్ నగర్. ఆదర్శనగర్. శ్రీనివాస కాలనీ. తో పాటు భగీరథ కాలనీ వంటి జిల్లా కేంద్రానికి శివారు కాలనీల పైన దొంగలు కన్ను వేసినట్లు తెలుస్తుంది. జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ తో పాటు పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న విషయం గమనించిన దొంగలు శివారు కాలనీలపై దృష్టి పెట్టి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ప్రజలు అంటున్నారు.జిల్లా ఎస్పీ ఎంత కృషి చేసినా కూడా ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల జిల్లా కేంద్రంలో చర్చనీయాం సంఘ మారింది. మహబూబ్నగర్ జిల్లా పరిధిలో మొత్తం 17 పోలీస్ స్టేషన్లో ఉన్నప్పటికీ ఇప్పటివరకు దాదాపు దొంగతనాల కేసులు వందల సంఖ్యలో జరిగిన కూడా నేరాలను అరికట్టడంలో నేరస్తులను అరెస్ట్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శలుస్తున్నాయి. పట్టపగలు రెక్కీ నిర్వహించి రాత్రి వేళలో దోపిడీ చేస్తున్నారని ఇంటి తాళాలను పగలగొట్టి దర్జాగా దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత చిక్కకుండా జరుగుతున్న దొంగతనాలను పోలీసులు పూర్తిస్థాయిలో అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక జిల్లా కేంద్రంలోని బాలాజీ నగర్ లో నివాసం ఉంటున్న ఒక కుటుంబం హైదరాబాదు వెళ్లడంతో ఇంట్లో బీరువాలో ఉన్న పది తులాల బంగారం దోపిడీ చేశారని. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయపల్లి రోడ్డులో ఒక మహిళ ఇల్లును నిర్మించుకోవడానికి దాచిపెట్టిన ఐదు లక్షల రూపాయలు నగదును విరువ పగల కొట్టి ఆమె నిద్రిస్తున్న సమయంలో దొంగలు చేసినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. మహబూబ్నగర్ జిల్లాతో పాటు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మూడు బైకులను దోపిడీ చేశారు. అదేవిధంగా జిల్లా పరిధిలోని అచ్చంపేట నియోజకవర్గంలో శ్రీనివాస కాలనీలో కూడా వ్యక్తులు చోరీకి పాల్పడి తాళం విరగొట్టి ఐదు లక్షల రూపాయలతో పాటు 16 తులాల బంగారాన్ని దోపిడి చేయడం ఈ వరుస దోపిడీలు దొంగతనాలు మహబూబ్నగర్. తో పాటు అచ్చంపేట లో కూడా జరగడం ప్రజలు భయభ్రాంతులకు గురికావడం అదేవిధంగా ఈ దొంగలు ఇతర జిల్లాల్లో కూడా దోపిడీకి పాల్పడే ప్రమాదం ఉందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు అచ్చంపేటలో కూడా దొంగతనం చేయడం వల్ల సమీప జిల్లాలైన నాగర్ కర్నూల్. వనపర్తి. గద్వాల. నారాయణపేట. జిల్లా పరిధిలోని నియోజకవర్గాలు గ్రామాలలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు పెట్రోలింగ్ నిర్వహించాలని ఈ చెడ్డి గ్యాంగ్ దొంగలను పోలీసులు కూకటివేలతో అణిచివేయాలని రాను రాను దొంగల బీభత్సం అరికట్టాలని ముందుగానే పోలీసులు తగు జాగ్రత్తతో మెలగాలని ప్రజలు కోరుతున్నారు. కేవలం మొక్కుబడిగా రాత్రి వేళలో పెట్రోలింగ్ నిర్వహించి చేతులు దులుపుకోకుండా పై జిల్లాల లోని పోలీస్ యంత్రాంగం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా రాత్రిపూట పటిష్టమైన పెట్రోలింగ్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని అప్పుడే దొంగతనాలను అరికట్టే అవకాశాలు ఉంటాయని ప్రజలు చూస్తున్నారు. సీసీ కెమెరాలను పనిచేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మూడు బైకులను దొంగలు ఎత్తుకు వెళ్ళిన సంఘటన సీసీ కెమెరాల్లో నమోదైన నేపథ్యంలో మిగతా చోటా కూడా ఇలాంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.