నేటి సత్యం .మొయినాబాద్ ఆగస్టు 13 
*రహదారులు కాదు యమపురికి దారులు*
*అధికారుల మొద్దు నిద్ర*
*ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది*
*సిపిఐ మండల కార్యదర్శి కే శ్రీనివాస్*
మొయినాబాద్ మండలంలోని ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు రైతులు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ప్రతిరోజు నరకయాతన అనుభవిస్తున్నారని నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్లు బాగు చేయించే నాధుడే కరువయ్యారని అధికారులకు ప్రత్యామ్నాయంగా రోడ్లు బాగు చేయాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదని ఎన్నికల వచ్చినప్పుడు మాత్రం ప్రజల ఓట్లు కావాలి కానీ ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం మరియు అధికారులు ఘోరంగా విఫలమైందని దుయ్యపట్టారు మొయినాబాద్ నుండి వరంగల్ శ్రీరామ్ నగర్ వెంకటాపూర్ కోల్కత్తా నక్కలపల్లి ఎగ్మోర్ పల్లి కనకమామిడి పెద్దమంగళారం సజ్జన్పల్లి గ్రామాలకు సంవత్సరాలు గడుస్తున్న రోడ్లు బాగాలేని దుస్థితి ఉందని ప్రజలు కట్టే పన్నులు వాహనదారులు కట్టే రోడ్డు టాక్స్లు ఎక్కడ పోతున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రభుత్వము మరియు అధికారులు రాజకీయ నాయకులు స్పందించి వెంటనే మరమ్మత్తు చర్యలు చేయాలని డిమాండ్ చేశారు