జీవన మార్గం చూపేది బడి.. బడి లేనిది భవిష్యత్తు లేదు
నేటి సత్యం జీవన మార్గాన్ని చూపేదే బడి – 2006–2007 పూర్వ విద్యార్థుల అపూర్వ బహుమతులు నేటి సత్యం. తెలకపల్లి. ఆగస్టు 15 తెల్కపల్లి మండల కేంద్రంలోని ఆలేరు గ్రామంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006–2007 విద్యాసంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థులు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. "జీవితాన్ని తల్లిదండ్రులు ప్రసాదిస్తే, జీవన మార్గాన్ని భవిష్యత్తుతో కలిపేది పాఠశాల" అని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంలో 2024–2025 విద్యాసంవత్సరంలో...