Neti Satyam
Newspaper Banner
Date of Publish : 15 August 2025, 2:49 pm Editor : Admin

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

*సి.ఆర్.పౌండేషన్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*

నేటి సత్యం. కొండాపూర్. ఆగస్టు 15

అనేక సమస్యలను అధిగమించి సాధించుకున్న దేశ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోవడం మన అందరికీ గర్వ కారణమైన ఓ చరిత్ర అని సిఆర్ ఫౌండేషన్ కార్యదర్శి, మాజీ ఎంఎల్ పి.జె. చంద్రశేఖరరావు అన్నారు. హైదరాబాద్ కొండాపూర్ చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ లో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పి.జె. చంద్రశేఖరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రోజు రోజుకు కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయని,
ప్రగతీశీల భావాలు కల్గిన గౌరీ లంకేశ్ చంపింది, ధర్మ స్థల మత సురహంకారులే అని, మహిళలు తమకు హక్కులకై మరింత మెల్కోవాలని, బయటి ప్రపంచాన్ని తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు .సిఆర్ ఫౌండేషన్ కోశాధికారి, వృద్దాశ్రమం డైరెక్టర్ వి.చెన్నకేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్ పి.జె.చంద్రశేఖరరావు, మహిళ సంక్షేమ కేంద్రం కమిటీ డైరెక్టర్ జోస్యభట్ల కల్పన , సిఆర్ పాలీ క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ కె.రజని పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా పిజె. చంద్రశేఖరరావు మాట్లాడుతూ మన దేశ తర్వాత స్వాతంత్య్రం సాధించుకున్న అనేక దేశాలు మన కన్నా వనరులు తక్కువగా ఉన్నా, సమశీతోషణం లేకపోయినా ఆర్ధికాభివృద్దిలో, జీవన ప్రమాణాల్లో ఎంతో ముందజలో ఉన్నాయన్నారు. ఆ దేశాలను చూసి మన పాలకులు గుణ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముందని ఆయన పేర్కోన్నారు. అత్యంత యువశక్తి గల మన దేశం ప్రస్తుతం ప్రపంచానికే అపార కార్మిక శక్తి, మేధో శక్తిని అందిస్తోందని అన్నారు. అయితే ప్రపంచ సంస్థలు, నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వం సంస్థల లెక్కల ప్రకారం రాబోయే 20 ఏళ్లలో భారత దేశ జనాభాలో 20 శాతం వృద్దులు ఉండబోతున్నారని తెలిపారు. వారికి సంబంధించిన జీవితం, ఆరోగ్యం, నివాసంతో పాటు సమస్యలు పరిష్కారాలపై ఇప్పటీ నుంచే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు చర్యలు కోవాలని సూచించారు.
జోస్యభట్ల కల్పన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటీ నుంచి ఇప్పటీ వరకు మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటునే ఉన్నారని అన్నారు. మహిళలు కొన్ని హక్కులు సాధించుకున్నప్పటికీ కొత్త కొత్త సమస్యల వస్తునే ఉన్నాయని వాటి పరిష్కారానికి సంఘంటింగా ఉద్యమించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
డాక్టర్ కూనంనేని రజని మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నప్పటికీ సాధించుకోవాల్సింది , తెలుసుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. ఇందుకు మహిళలు బయట ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు అంచన వేస్తూ అందుకు అనుగుణంగా ఉద్యమించాలని సూచించారు. విద్యార్థినులు చదువులపై దృష్టిని కేంద్రీకరించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

*సీనియర్ సంపాదకులు ఎబికె ప్రసాద్ ఘన సన్మానం ః*
గత రెండున్న దశాబ్దాలుగా సిఆర్ ఫౌండేషన్ వృద్దాశ్రమంలో నివసిస్తున్న సీనియర్ సంపాదకులు
ఎబికె ప్రసాద్ 90వ జన్మదినోత్సవం సందర్భంగా సిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ సైంటిస్ట్ వృద్దాశ్రమ వాసి మల్లంపాటి వెంకశ్వరరావు ఎబికె ప్రసాదరావు పై రాసిన కవితను చదివి ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు అరుట్ల మమత, లలిత, సలహామండలి సభ్యులు డాక్టర్ మండవ గోపిచంద్, రాజేందర్ రావు, తమ్మారెడ్డి తాన్యా, వృద్దాశ్రమవాసులు రామకృష్ణరెడ్డి, రాజేశ్వరి, వృద్ధాశ్రమ వాసులు,మహిళా సంక్షేమ కేంద్రం విద్యార్ధినులు తదితరులు పాల్గొన్నారు.