Neti Satyam
Newspaper Banner
Date of Publish : 15 August 2025, 2:54 pm Editor : Admin

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ll యాదగిరి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

*79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న : రాజీవ్ గాంధీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ) రాష్ట్ర సలహాదారుడు: కృపాటి యాదగిరి*
*హైదరాబాద్ : ఆగస్టు 15 నేటి సత్యం ప్రతినిధి మిమిక్రీ యాకన్న*
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హయత్‌నగర్ లేబర్ అడ్డా వద్ద తెలంగాణ స్టేట్ రాజీవ్ గాంధీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ( ఐఎన్టీయూసీ ) ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎరగాని నాగన్న గౌడ్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ రాజీవ్ గాంధీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, రాష్ట్ర సలహాదారుడు కృపాటి యాదగిరి పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్ర సమరయోధుల సేవలను మరవలేమని అన్నారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఆర్గనైజర్ స్టేట్ సెక్రటరీ పెద్దవూర బ్రహ్మయ్య , రాష్ట్ర ఉపాధ్యక్షులు శాగంటి ప్రభాకర్ పాల్గొన్నారు.