Neti Satyam
Newspaper Banner
Date of Publish : 16 August 2025, 6:44 am Editor : Admin

స్వాతంత్ర పోరాటాన్ని అవమానపరిచే విధంగా మోదీ మాట్లాడారు సిపిఐ నారాయణ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 16

స్వాతంత్ర దినోత్సవాన్ని దేశమంతా పండగ వాతావరణంలో ఉత్సవాలు చేసికొంటుంటే అదే ఆగస్టు 15 వ తేదీన ప్రధాని మోడీ ఢిల్లీ ఎర్రకోటపై నుండి స్వాతంత్ర పోరాటాన్ని అవమాన పరిచేవిధంగా , స్వతంత్రపోరాటం లో అసువులుబాసిన అమరవీరులకు ద్రోహం చేసేవిధంగా మాట్లాడడం భారతప్రజలను అవమానపరచడమే . 1925 లో సిపిఐ , ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది . ఆనాటినుండి బ్రిటిష్ పాలనాకువ్యతిరేకంగా సిపిఐ యితర దేశభక్తులందరు ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్నారు . తుపాకీగుండ్లకు బలయ్యారు , తూటాలకు లాఠీలకు ఎదురొడ్డారు . Rss చరిత్రలో ఏవిక్కడయినా పాల్గొన్నారా , లాఠీలకు తూటాలకు గురయ్యారా , వుంటే ఒక పేరయినా చెప్పగలరా ?? సావర్కర్ పాల్గొని అరెస్ట్ అయి అండమాన్ జైలులోనుండి బ్రిటిష్ పాలనకు లొంగి క్షమాపణ చెప్పి బయటికి వచ్చి , rss వాళ్ళని బ్రిటిష్ ఉద్యమంలో పాల్గినవద్దని ఆదేశించడం వాస్తవం కదా ? అలాంటి చరిత్రకలిగిన rss ను పొగడడమంటే అంతకన్నా మించిన దేశద్రోహం యింకొకటిఉండా ?? చరితాత్మక ఎర్రకోట అవమానంకదా ?? దేశభక్తులు క్షమించరు గాక క్షమించరు . from. Narayana cpi salam tamilnadu cpi stateconference