(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం వనపర్తి. ఆగస్టు 17 
*దేశభక్తి పై మాట్లాడే నైతిక హక్కు బిజెపికి లేదు: భాస్కర్*
దేశభక్తి గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపికి లేదని, నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు భాస్కర్ అన్నారు. ఆదివారం వనపర్తి లో సిపిఐ జిల్లా నేత కళావతమ్మ నివాస గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కమ్యూనిస్టులను ఏరువేస్తామని, వారి దేశభక్తిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. 1925, డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో కమ్యూనిస్టు పార్టీ పురుడు పోసుకుందన్నారు. అప్పుడే ఆర్ఎస్ఎస్ కూడా పుట్టిందన్నారు. దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని తొలిసారి డిమాండ్ చేసింది కమ్యూనిస్టులే అన్నారు. ప్రజలను సమీకరించి స్వాతంత్రం కోసం పోరాడిందన్నారు. ఆర్ఎస్ఎస్ లో ఒక్కరు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదని, దేశభక్తిని గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదన్నారు. స్వాతంత్రం కోసం, తెలంగాణ విముక్తి కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో కమ్యూనిస్టులు ప్రాణ త్యాగం చేశారన్నారు. ఆపరేషన్ కంగారు పేరుతో మార్చి 2026 నాటికి కమ్యూనిస్టులను ఏరివేస్తామని బండి సంజయ్ చెప్పటం దుర్మార్గమన్నారు. ఎర్రజెండాను అంతం చేసే శక్తి బీజేపీకి లేదన్నారు. బండి సంజయ్ తను వ్యాఖ్యలను ఖండించారు, ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, శ్రీరామ్, రమేష్, మోష, ఏఐవైఎఫ్ నేత లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.