Neti Satyam
Newspaper Banner
Date of Publish : 18 August 2025, 7:38 am Editor : Admin

జయ జనార్ధన భక్తి గీతo

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

జయ జనార్దనా….

జయ జనార్ధనా కృష్ణా రాధికాపతే
జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

గరుడవాహనా కృష్ణా గోపికాపతే నయనమోహనా కృష్ణా నీరజేక్షణా
జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

సుజనబాంధవా కృష్ణా సుందరాకృతే మదనకోమలా కృష్ణా మాధవాహరే
వసుమతీపతే కృష్ణా వాసవానుజా

వరగుణాకరా కృష్ణా వైష్ణవాకృతే
సురుచినాననా కృష్ణా శౌర్యవారిధే
మురహరా విభో కృష్ణా ముక్తిదాయకా
విమలపాలకా కృష్ణా వల్లభీపతే
కమలలోచనా కృష్ణా కామ్యదాయకా
జయ జనార్ధనా కృష్ణ రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

విమలగాత్రనే కృష్ణా భక్తవత్సలా
చరణపల్లవం కృష్ణా కరుణకోమలం
కువలయేక్షణా కృష్ణా కోమలాకృతే తవపదాంభుజం కృష్ణా శరణమాశ్రయే
భువననాయకా కృష్ణా పావనాకృతే గుణగణోజ్వలా కృష్ణా నళినలోచనా
ప్రణయవారిధే కృష్ణా గుణగణాకరా దామసోదరా కృష్ణా దీనవత్సలా
జయ జనార్ధనా కృష్ణ రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

కామసుందరా కృష్ణా పాహిసర్వదా నరకనాశనా కృష్ణా నరసహాయకా
దేవకీసుతా కృష్ణా కారుణ్యాంబుధే కంసనాశనా కృష్ణా ద్వారకాస్థితా
పావనాత్మకా కృష్ణా దేహిమంగళం తత్పదాంభుజం కృష్ణా శ్యామకోమలం
భక్తవత్సలా కృష్ణా కామ్యదాయకా పాలిశెన్ననూ కృష్ణా శ్రీహరీనమో
జయ జనార్ధనా కృష్ణ రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా

భక్తదాసనా కృష్ణా హరసునీసదా కాదునింతినా కృష్ణా సలహయావిభో
గరుడవాహనా కృష్ణా గోపికాపతే నయనమోహనా కృష్ణా నీరజేక్షణా
జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా..