Neti Satyam
Newspaper Banner
Date of Publish : 18 August 2025, 10:01 am Editor : Admin

హాస్యస్వందం!!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

హాస్యాస్పదం!

కులం పోట్లాటలు
హాస్యాస్పదం!
ఎవరిది ఏ కులం?

'గుంపు' దశలో
విచ్చలవిడి లైంగికం!
వావివరసలే లేవు!

దీనిని క్రమబద్ధం
చేసేందుకే వివాహం!
కులాలెక్కడివి?

మతగ్రంధాలనిండా
ఏ మతమైనా కానీయ్
విచిత్ర జననాలు!

బహుభార్యలు
పంచభర్తృకలు
కన్యలసంతానం!

చెప్పుకుంటూ పోతే
కడుపుచించుకుంటే
కాళ్ళమీద పడుతుంది!

జంతువులకు కూడా
పుట్టిన మహాత్ములు!
వీళ్లది ఏ కులం?

కులం ఎక్కడుందిరా
మూర్ఖ శిఖామణీ!
అంతా మానవకులం!

అక్రమ సంబంధాలు
ఇప్పటికైనా ఆగాయా?
ఆపేవాడెవడు?

ముసుగులోగుద్దులాట
అతిగామాట్లాడుకుంటే
సిగ్గుపోతుంది

కులాన్ని తొలగించు!
కులం పోట్లాటలు
హాస్వాస్పదం!

Copyright © 2026 Neti Satyam. All rights reserved.