Neti Satyam
Newspaper Banner
Date of Publish : 18 August 2025, 10:18 am Editor : Admin

బొడ్రాయి నాభి శిల ప్రతిష్ట మహోత్సవం!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

తొర్రూరు గ్రామంలో ఆధ్యాత్మిక శోభతో బొడ్రాయి (నాభిశిల) ప్రతిష్ఠ మహోత్సవం మరియు ఎల్లమ్మ దేవాలయం ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

నేటి సత్యం. ఇబ్రహీంపట్నం ఆగస్టు 18

తమ సొంత గ్రామంలో జరుగుతున్న ఈ వేడుకలకు ఇబ్రహీంపట్నం గౌరవ ఎమ్మెల్యే *శ్రీ మల్‌రెడ్డి రంగారెడ్డి* గారు మరియు గౌరవ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ *శ్రీ మల్‌రెడ్డి రాంరెడ్డి* గారు ముఖ్య అతిథులుగా హాజరై, శాస్త్రోక్త పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

వేదపండితులు ప్రత్యేకంగా సిద్ధం చేసిన బొడ్రాయికి మంత్రోచ్చారణల మధ్య వివిధ పూజలు నిర్వహించి, ఊరి నడిబొడ్డున ప్రతిష్ఠించారు. శాస్త్రోక్త విధానంలో జరిగిన ఈ ప్రతిష్ఠకు గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

అనంతరం ఎల్లమ్మ దేవాలయం ధ్వజస్తంభ ప్రతిష్ఠ విశేషంగా ఆకట్టుకుంది. పంచవాద్య నినాదాలు, యజ్ఞ యాగాలు, హారతులతో నిర్వహించిన ఈ మహోత్సవం భక్తి పరవశాన్ని కలిగించింది. ఈ సందర్భంగా గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.

“ఇలాంటి ఆధ్యాత్మిక, సాంప్రదాయ కార్యక్రమాలు గ్రామాల ఐక్యతకు ప్రతీక. ఇవి ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించి, సాంప్రదాయ విలువలను కాపాడటానికి దోహదం చేస్తాయి” అని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి గారు పేర్కొన్నారు.

‘’ బొడ్రాయి మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. గ్రామంలో రేపు (మంగళవారం) బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ‘’ అని మల్‌రెడ్డి రాంరెడ్డి గారు తెలిపారు.

ఈ మహోత్సవంలో గ్రామ పెద్దలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.