Neti Satyam
Newspaper Banner
Date of Publish : 18 August 2025, 10:21 am Editor : Admin

మా స్కూలు అంటే మాకు భయం!! విద్యార్థుల గోడు వినండి!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

అధికారుల్లారా..! మా పాఠశాలను పట్టించుకోండి.. !
కొల్లాపూర్, ఆగస్టు 18 (నేటి సత్యం ప్రతినిధి: యస్.పి. మల్లికార్జున సాగర్).
అధికారుల్లారా..! ప్రజాప్రతినిధులారా..!
మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహిస్తున్న కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం దగడపల్లి గ్రామం లోని ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ను పట్టించు కోండి విద్యార్థులను కాపాడండి అంటూ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
ప్రస్తుతము దగడపల్లి లోని ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ పాఠశాల గోడలు పర్రెలు వాసి కూలడానికి సిద్ధం గా ఉందని, తరగతి గదుల పై కప్పులు పెచ్చులూడిపోయి కిందపడి పోతున్నాయని పాఠశాల పై కప్పు నుండి వర్షపు నీరు కారి పాఠశాల అంతా నీరు నిలిచిపోయి పాకర పట్టి దుర్గoదాలు వ్యాపిస్తున్నాయని ఇలాంటి పరిస్థితులు ఉన్న తరగతి గదులలో విద్యార్థులు కూర్చొని చదువుకొన లేకపోతున్నారని పైకప్పు కూలి విద్యార్థులకు ఏదైనా ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులని పాఠశాల దుస్థితిని చూస్తున్నవారు ప్రజాప్రతినిధులను ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
ఇట్టి విషయాన్ని అధికారులు అనధికారులు ప్రజా ప్రతినిధులకు గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ తెలియ చేస్తున్నామని పాఠశాల ఉపాధ్యాయులు తెలియజేశారు.
దగడపల్లి గ్రామ పాఠశాలకు” మన ఊరు మనబడి పథకము” కింద 96 లక్షల రూపాయల టెండర్ వర్క్ వచ్చి ఉన్నది.ఇట్టి నిర్మాణాన్ని ఇప్పటివరకు కూడా కంప్లీట్ కాలేదు.స్టార్ట్ చేసి వదిలేయడం జరిగినది అని గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు తెలియజేశారు.
పాఠశాల గోడలు పర్రెలు వాసి, పాఠశాల తరగతి గదుల పై పెచ్చులు కూలిపోయి వర్షపు నీరంతా పాఠశాల గదు లలో నిలిచి ఉండి విద్యార్థులు కూర్చొనేందుకు వీలు లేదని, తాము పాఠశాల గదు లలో విద్యాబోధన చేసే పరిస్థితులు లేవని ఇంతటి దుస్థితిలో ఉన్న” పాఠశాలకు సెలవు ప్రకటించి” విద్యార్థుల జీవితాలను కాపాడేందుకు తాము నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ పాఠశాల ఉపాధ్యాయులు తెలియజేశారు.
దగడపల్లి లోని పాఠశాల దుస్థితిని గుర్తించి కొల్లాపూర్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టించుకోని పాఠశాల గదులను త్వరిత గతి న పూర్తి చేసి నూతన భవనాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు సక్రమం గా విద్యా బోధన జరిగేందుకు కృషి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు మంత్రి కృష్ణారావు కు విజ్ఞప్తి చేస్తున్నారు.