మా స్కూలు అంటే మాకు భయం!! విద్యార్థుల గోడు వినండి!!
నేటి సత్యం అధికారుల్లారా..! మా పాఠశాలను పట్టించుకోండి.. ! కొల్లాపూర్, ఆగస్టు 18 (నేటి సత్యం ప్రతినిధి: యస్.పి. మల్లికార్జున సాగర్). అధికారుల్లారా..! ప్రజాప్రతినిధులారా..! మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహిస్తున్న కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం దగడపల్లి గ్రామం లోని ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ను పట్టించు కోండి విద్యార్థులను కాపాడండి అంటూ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ప్రస్తుతము దగడపల్లి లోని ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ పాఠశాల గోడలు పర్రెలు వాసి కూలడానికి...