(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం 
*రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి శాసనసభ్యులు కూనమినేని సాంబశివరావు*
నేటి సత్యం. హైదరాబాద్. ఆగస్టు 18
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, గాజుల రామారంలోని మహారాజ గార్డెన్స్‌లో 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు తెలిపారు. హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్యపద్మ, జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్.బోస్, ఈటి నరసింహా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.జి. సాయిల్ గౌడ్, మహాసభలఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎం.డి.యూసుప్, ప్రధాన కార్యదర్శి, ఉమామహేశ్, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్, కౌన్సిల్ సభ్యులు దామోదర్‌రెడ్డి కలిసి కూనంనేని సాంబశివరావు మహాసభల వివరాలను వెల్లడించారు. 100 ఏళ్ల ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు 20వ తేదీన (బుధవారం) ప్రారంభంకానున్నాయని కూనంనేనిసాంబశివరావు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగి మహాసభల్లో 743 ప్రతి నిధులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు కలుపుకుని 1000 మంది పాల్గొనున్నారని తెలిపారు. ఆయన వెల్లడించారు. మహాసభల్లో భాగంగా బుధవారం ఉదయం 9 గంటలకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ నుండి మహాసభల వేదికైన మహారాజ గార్డెన్స్ వరకు రెడ్ ప్లాగ్ మార్చ్ ఉంటుందన్నారు. ప్రదర్శన అనంతరం ఉదయం 10 గంటలకు సిపిఐ సీనియర్ నాయకులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కందిమళ్ల ప్రతాపరెడ్డి అరుణ పతాకాన్ని ఎగురవేయనుండగా 10.15గంటలకు ప్రముఖ కవి, నవ చేతన పబ్లిషింగ్ హౌజ్ సంపాదకులు ఏటుకూరి ప్రసాద్ మృతవీరుల స్థూపాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. ఉదయం 11గంటలకు రాష్ట్ర 4వ మహాసభల ముఖ్యఅతిథులు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా మహాసభలనుప్రారంభిస్తారన్నారు. అతిథులు సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్‌పాషా, సౌహార్ధ్ర ప్రతినిధులుగా సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఐ(ఎం) రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరుకానున్నారని కూనంనేని సాంబశివరావు వెల్లడించారు.
*మహాసభల ప్రాంతానికి పోట్లూరి నాగేశ్వరావు నగర్‌గా నామకరణం ః*
సిపిఐ రాష్ట్ర 4వ మహాసభల ప్రాంతానికి ఎఐటియుసి సీనియర్ నాయకులు దివంగత పోట్లూరి నాగేశ్వరరావునగర్ గా నామకరణం చేసినట్లు కూనంనేని సాంబశివరావు తెలిపారు. అదేవిధంగా మహసభల ప్రాంగణానికి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దివంగత ఎన్.బాలమల్లేష్ పేరును,భోజనశాలకు మేడ్చల్ జిల్లా నాయకులు దివగంత రోయ్యల కృష్ణమూర్తి, కె.సహాదేవ్‌ల పేర్లను పెట్టామని వెల్లడించారు.
*మహాసభల వేదికగా ప్రజాసమస్యలపై ఉద్యమ కార్యాచరణ ః*
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఎండగట్టేందుకు మహాసభల వేదికగా ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోనున్నామని కూనంనేని సాంబశివరావు తెలిపారు. ముఖ్యంగా మతోన్మాద పార్టీ అయిన బిజెపి ఫాసిస్టు విధానాలను అనుసరిస్తూ మతం, కులం, జాతి, భాషా పేర్లతో చిచ్చు పెడుతూ దేశ ప్రజలను చీల్చిందుకు కుట్ర పనుతోందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని 240 సీట్లకు కట్టడి చేసి కొంత నియంత్రించగలిగామని, భావసారుప్యత గల పార్టీలతో కలిసి భవిష్యత్‌లో బిజెపి రాజకీయంగా మరింత కట్టడి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రజలకు మరింత చేయాల్సి ఉందని, ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోకాంగ్రెస్ ప్రభుత్వంప్రభుత్వరంగ సంస్థను నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు.ఇప్పటికీ ఆర్‌టిసిలో ఎన్నికలు నిర్వహించకపోవడం అప్రజాస్వామికమని, అదేవిధంగా అసంఘంటిత కార్మికులను ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఈ సమస్యలపై మహాసభల అనంతరం ఉద్యమించనున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సిపిఐ, సిపిఎం పార్టీతో పొత్తు ఉంటుందని, అదేవిధంగా కాంగ్రెస్‌తోనే స్నేహబంధం కొనసాగుతుందని తెలిపారు.
*తెలంగాణ సాయుధ పోరాట యోధులకు తగిన గుర్తింపు ఇవ్వాలి ః చాడ వెంకటరెడ్డి*
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లేనిదే తెలంగాణ లేదనిచాడ వెంకటరెడ్డి అన్నారు.ఆలాంటి సమరయోధులకు గత ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తింపును ఇవ్వకపోవడం బాధాకరమని, వారికి సరైన గౌరవాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలనిడిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా నాటి రైతాంగ సాయుధ పోరాట సమర యోధుల వీర గాధలు, వారి పోటోలతో ఆహ్వాన సంఘం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పశ్యపద్మ మాట్లాడుతూ మహాసభల్లో జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో దేశ, రాష్ట్ర రాజకీయాలు, ఉద్యోగ, కార్మిక, రైతు, వ్యవసాయ కూలీలు, ప్రజా సమస్యలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నట్లు తెలిపారు. మహాసభల ఏర్పాట్లను ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎండి.యూసుప్ వివరించారు.