నేటి సత్యం

*నరసింహులపేట మండల కేంద్రంలో గిరిజన బాల బాలికల వసతి గృహాలు నిర్మించాలి*
*విద్యార్థి పోరు గర్జన జీపు యాత్ర రథసారథి, ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు*
నేటి సత్యం ఆగస్టు 19 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య
*నరసింహుల పేట మండలానికి చేరుకున్న విద్యార్థి పోరు గర్జన జీపు యాత్ర*
*నరసింహులపేట మండల కేంద్రంలో 500 మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభ*
*పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు ప్రీయంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్.ఎఫ్.ఐ నేతలు డిమాండ్*
*తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా రంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్.ఎఫ్.ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు విమర్శించారు… ఈ సందర్భంగా మంగళవారం నర్సింహులపేట మండల కేంద్రానికి చేరుకుంది.. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఎస్.ఎఫ్.ఐ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 300 మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభను నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న కనీసం తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరని విమర్శించారు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అధికారులు విఫలమయ్యారని అన్నారు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 8500 కోట్ల స్కాలర్షిప్లను విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు విభజన హక్కులను కాపాడడంలో తెలంగాణ రాష్ట్ర ఎంపీలు విఫలమయ్యారని అన్నారు.. పెండింగ్స్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ గత రెండు సంవత్సరాలుగా అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తునది అని తెలిపారు.. జిల్లావ్యాప్తంగా 700 కీలో మీటర్లు, 16 మండలాలో ఎస్.ఎఫ్.ఐ పూర్గర్జన యాత్ర జరుగుతుందని తెలియజేశారు అనంతరం ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గంధసిరి జ్యోతి బసు మాట్లాడుతూ .. నర్సంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మించాలని డిమాండ్ చేశారు ..ఈ పోరు గర్జన జీపు యాత్ర గుర్తించిన సమస్యలను జిల్లా అధికారులు,ఎమ్మెల్యేలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు*
*ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా నాయకులు ఎండి అమీర్, గుండ్ల రాకేష్ కళ్యాణి ఆకాశ్,రెబెల్లి శ్రుతి, ఉదయ్,మహేష్,నవీన్ ,ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు*