నేటి సత్యం.
నేటి నుండి సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు
హాజరు కానున్న సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 19
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలకు అన్ని ఏర్పాట్లు పూరైయ్యాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, గాజుల రామారంలోని మహారాజా గార్డెన్స్(కామ్రేడ్ పోట్లూరి నాగేశ్వరరావు నగర్)లో నేటి (బుధవారం) నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఆహ్వాన సంఘం సర్వం సిద్దం చేసింది.( కామ్రేడ్ ఎన్.బాలమల్లేష్) హాల్‌లో ఉదయం11 గంటలకు రాష్ట్ర మహాసభలను ముఖ్యఅతిథి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రారంభిస్తారు. ఈమహాసభలకు అతిథులుగా సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్.కె.నారాయణ, సయ్యద్ అజీజ్‌పాషా, సౌహార్ధ్ర ప్రతినిధులుగా సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొనున్నారు. ఉదయం 9 గంటలకు మహాసభల ప్రాంగణం వరకు రెడ్ ప్లాగ్ మార్చ్ నిర్వహిస్తారు. 10 గంటలకు మహాసభల ప్రారంగణంలో సిపిఐ సీనియర్ నాయకులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కందిమళ్ల ప్రతాప రెడ్డి అరుణ పతాకాన్ని ఎగురవేస్తారు. 10.15 గంటలకు ప్రముఖ కవి, నవ చేతన పబ్లిషింగ్ హౌజ్ సంపాదకులు ఏటుకూరి ప్రసాద్ అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న మహాసభల్లో 743 మంది ప్రతినిధులతో పాటు సిపిఐ సీనియర్ నాయకులు, ప్రత్యేక ఆహ్వానితులు మహాసభల్లో పాల్గొనున్నారు.
మధ్యాహ్నాం 3.15 గంటలకు ప్రతినిధుల సభ ప్రారంభం ః
మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రతినిధుల సభ ప్రారంభం కానుంది. ప్రతినిధుల సభ ప్రారంభం కాగానే రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు ఎజెండా ప్రతిపాదన, కమిటీల ప్రతిపాదించనున్నారు. అనంతరం అధ్యక్షవర్గం, స్టీరింగ్ కమిటీ, మీడియా బ్రీఫింగ్ కమిటీ, తీర్మానాల కమిటీ, మినిట్స్ కమిటీ, అర్హతల కమిటీని ఎన్నుకోనున్నారు. అనంతరం గత మహాసభల నుంచి ఇప్పటీ వరకు మరణించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రముఖల సంబంధించిన సంతాప తీర్మానాన్నిరాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎం.డి. యూసుప్ స్వాగతోపన్యాసం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రతినిధుల సభను ఉద్దేశించి ముఖ్య అతిథులు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై ప్రసంగించనున్నారు. 5 గంటలకు రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు రాష్ట్ర రాజకీయాలు, పార్టీ నిర్మాణ నివేదకలను సమర్పించనున్నారు. ఈ నివేదికలపై ప్రతినిధుల సభ చర్చించి అవసరమైన తీర్మానాలను చేయనున్నారు.
రెండవ రోజు సభ వివరాలు ః
రాష్ట్ర మహాసభలో భాగంగా గురువారం రెండవరోజు ఉదయం 9.30గంటలకు ప్రారంభం కానుంది. ప్రతినిధుల సభనుద్దేశించి ఉదయం 10.30గంటలకు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్.కె.నారాయణ ప్రసంగించనున్నారు. భోజన విరామం తర్వాత తిరిగి 3.30 గంటలకు ప్రతినిధుల సభ ప్రారంభంకానుంది. సాయంత్రం 4.30గంటలకు ప్రతినిధుల సభనుద్దేశించి సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్‌పాషా మాట్లాడుతారు. అనంతరం వివిధ అంశాలపై చర్చలు, తీర్మానాలు చేయనున్నారు.
మూడవ రోజు సభ వివరాలు ః
మహాసభ మూడవ రోజు శుక్రవారం ఉదయం 9.00 గంటలకు ప్రారంభం కానుంది. 10.30 గంటలకు ప్రతినిధుల సభను నుద్దేశించి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు ఆడిట్ కమిటీ, అర్హతల కమిటీ, కంట్రోల్ కమిషన్ నివేదికలు సమర్పణ, 11.30గంటలకు చర్చలకు సమాధానం ఉంటుంది.. మధ్యాహ్నాం12.30 గంటలకు నూతన సమితి ఎన్నిక, జాతీయ మహాసభలకు ప్రతినిధుల ఎన్నికతో పాటు ఆహ్వాన సంఘానికీ ధన్యవాదా కార్యక్రమం ఉంటుంది. భోజన విరామం తర్వాత నూతన సమితి సమావేశమై కార్యవర్గం, కార్యదర్శి, కార్యదర్శివర్గాన్ని ఎన్నుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు మహాసభలు ముగియనున్నాయి.
ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫోటో ఎగ్జిబిషన్ ః
సిపిఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా భూమి కోసం&. భూక్తి కోసం& వెట్టి చాకిరి విముక్తే లక్ష్యంగా మట్టి మనుషులు బందూకులు పట్టి దొరల గడీలను గడగడలాండించడమే కాకుండా రజకార్ ముష్కరులను తరిమికొట్టిన మహోత్తర సమరమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర ఘట్టాలతో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సాయుధ పోరాట ఘట్టాలు, చరిత్రతో కూడిన ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటుంది.. నాటి మహోత్తర పోరాట చరిత్రను భావి తరాలకు తెలియజేప్పేందుకు నాటి సాయుధ సమరం యోధులు ఆ పోరాటం అశువులు భాసిన వీర యోధులు ఫోటోలను ఏర్పాటు చేశారు. మరోవైపు అమరవీరుల స్తూప్నాని ఏర్పాటు చేశారు.
అరుణ పతాకాల రెపరెపలు ః
సిపిఐ రాష్ట్ర మహాసభల ప్రాంగణం (కామ్రేడ్ పోట్లూరి నాగేశ్వరరావు నగర్) పూర్తిగా ఎరుపెక్కింది..అరుణ పతకాలతో ఈ ప్రాంతం ముస్తాబు చేశారు.. మహాసభల వేదికైన (కామ్రేడ్ బాలమల్లేష్ )హాల్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.షాపూర్ నగర్ చౌరస్తా నుంచి మహాసభల వేదికైన మహారాజా గార్డెన్ (కామ్రేడ్ పోట్లూరి నాగేశ్వరరావు నగర్) వరకు ప్రత్యేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కటౌట్లతో ఆలకరించారు. మరోవైపు రోడ్డుకు ఇరువైపుల అరుణ పతాక తోరణాలతో ముస్తాబు చేశారు.