(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం 
*ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా, పరిపాలనకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు… శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు.*
నేటి సత్యం. శేరిలింగంపల్లి ఆగస్టు 20
*శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ లోగల జిపిఆర్ క్వార్టర్స్ వద్ద బాలాజీ గ్రౌండ్స్ లో శేరిలింగంపల్లి అభివృద్ధికి బాటలు వేస్తూ.. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయము మరియు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు.*
*ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారుడు వేమ్ నరేందర్ రెడ్డి గారు, జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి గారు మంత్రివర్గ సభ్యులు, శేరిలింగంపల్లి నియోజకవర్గం కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులతో కలసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు.*
*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్పొరేట్ స్థాయిలో రిజిస్ట్రార్ భవన సముదాయలు అన్ని హంగులతో చేపడుతున్నట్లు తెలిపారు.*
*గతంలో సరైన మౌలిక సదుపాయాలు లేక పేద మధ్య తరగతి కుటుంబాల నుండి ప్రతిఒక్కరూ రిజిస్ట్రార్ ఆఫీస్ కు వస్తే చేదు అనుభవం ఎదురుకోవాల్సిన పరిస్థితులు ఉండేవని వాటిని అధికమించి ప్రజా పాలనలో భాగంగా 5 స్టార్ హోటల్ హోదాలో అన్ని సదుపాయాలతో రిజిస్ట్రేషన్ ఆఫీస్ నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.*
*వచ్చే ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లోపు నిర్మాణ పనులు పూర్తి చేసి రిజిస్ట్రార్ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రారంభించుకుంటామని హామీ ఇచ్చారు. అందుకు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు కృషి చేయాలని సీఎం గారు సూచించారు.*
*ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, నాయకురాళ్లు, అభిమానులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.*