నేటి సత్యం 

*భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర నాల్గవ మహాసభలలో రంగారెడ్డి జిల్లా రిపోర్టును ప్రవేశపెడుతున్న జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య*
నేటి సత్యం. గాజులరామారం హైదరాబాద్. ఆగస్టు 21
భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర నాల్గవ మహాసభలు మేడ్చల్ జిల్లాలోని గాజుల రామారం లో 20వ తేదీ నుండి ప్రారంభం అయినాయి మొదటి రోజు భారీ ప్రదర్శన రెండవ రోజు రెండవ రోజు జిల్లా కార్యదర్శుల రిపోర్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పడం సమంజసం కాదని ఒకవేళ అలాంటి నిర్ణయాలు తీసుకుంటే దానికోసం భారత కమ్యూనిస్టు పార్టీ పరంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని తెలిపారు శిథిలావస్తులో కూరుకుపోయిన ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన భవనాలను నిర్మించాలని విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ ను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇండ్లు లేని నిరుపేదల కోసం భూ పోరాటాలు నిర్వహించి వారికి పట్టాలు వచ్చే విధంగా పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్టు పార్టీ పరంగా ప్రజా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు మార్వాడి గో బ్యాక్ విషయంలో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాచరణ తెలపాలని రాష్ట్ర పార్టీకి విజ్ఞప్తి చేశాడు