వృధా కాదు కామ్రేడ్….. ని…. మరణం…!!
సురవరం ద లీడర్..! లీడర్.. తమ పార్టీకి, కేడర్‌కు, జాతి భవితకు ఓ రాడార్. తన మాటతో, చేతతో కార్యకర్తలను కదంతొక్కించడమే కాదు, తన వాదన పటిమతో ప్రత్యర్థులను పరుగులు పెట్టించడం, మేధావులు, నిపుణులు, విశ్లేషకుల మద్దతు పొందడం సమర్థ నాయకత్వ లక్షణం. అధ్యయనం, అవగాహన, ఆచరణ.. త్రివేణి సంగమంగా మదిలో, హృదిలో మథనం జరిగితేనే జనాభ్యుదయం, దేశ హితం కాంక్షించే దశ, దిశలో తను సాగడమే కాదు, జాతిని కదిలించగలుగుతారు. అటువంటి వ్యక్తులే నిజమైన జాతి...