Neti Satyam
Newspaper Banner
Date of Publish : 23 August 2025, 10:54 am Editor : Admin

నింగికి.. ఎగిసిన ఎర్ర సూర్యుడు. నీ.. ఆశయ సాధన కోసం పోరాడుతాం!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

*నింగికెగసిన ఎర్ర సూరీడు*

*కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటు*

*భారత కమ్యూనిస్టు పార్టీ చేవెళ్ల మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు*

*సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే రామస్వామి*
నేటి సత్యం చేవెళ్లే ఆగస్టు 23

భారత కమ్యూనిస్టు పార్టీ చేవెళ్ల మండల సమితి ఆధ్వర్యంలో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి ఘనంగా పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే రామస్వామి మాట్లాడుతూ
సిపిఐ అగ్ర నాయకులు, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంటు సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి(83) నిన్న రాత్రి తేదీ: 22- 8- 2025 న 10 గంటలకు తుది శ్వాస విడిచారు.
సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4 వ మహాసభలు ముగింపుజరుగుతున్న సమయములో రాత్రి 10 గం. లకు కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు సురవరం సుధాకర్ రెడ్డి గారు1960లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమంలో రాజకీయ రంగ ప్రవేశం చేసి,1964-72 రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షులుగా, జాతీయ అధ్యక్షులుగా విద్యార్థి ఉద్యమాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనూ , జాతియా స్థాయిలో అత్యున్నత శిఖరానికి తీసుకుపోయారు. 1972-78 వరకు ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ, కార్యదర్శివర్గ సభ్యులుగా, 1997 లో రాష్ట్ర సహాయ కార్యదర్శిగా,2000 లో కార్యదర్శిగా, 2010 లో జాతీయ సహాయ కార్యదర్శిగా,2012,లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ.. అనారోగ్య కారణాలతో 2019 లో స్వచ్ఛందంగ విరమించుకున్నాడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం పార్టీకి తీరని లోటు అని తెలిపారు ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు నివాళులు అర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ప్రభు లింగం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్ల సత్యనారాయణ సిపిఎం డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ , చేవెళ్ల మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి మొయినాబాద్ మండల పార్టీ కార్యదర్శి కే శ్రీనివాస్ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎండి మక్బూల్ సుధాకర్ గౌడ్, వడ్ల మంజుల మహిళా సంఘం మండల కార్యదర్శి లలిత వెంకటమ్మ యశోద అంజిరెడ్డి యాదగిరి రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు