Neti Satyam
Newspaper Banner
Date of Publish : 25 August 2025, 2:49 am Editor : Admin

సురవరం సుధాకర్ రెడ్డికి రెడ్ ఆర్మీ తో సిపిఐ ఘనంగా వీడ్కోలు!! వీడ్కోలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం ఆగస్టు 25

సురవరం సుధాకర్ రెడ్డికి ‘రెడ్ ఆర్మీ’తో సిపిఐ ఘనంగా అంతిమ వీడ్కోలు
అధికార లాంఛనాలతో ప్రభుత్వ గౌరవ వందనం… అంతిమ యాత్ర
గాంధీమెడికల్ కాలేజీకి భౌతికకాయం అప్పగింత
హైదరాబాద్: సిపిఐ అగ్రనేత, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపి సురవరం సుధాకర్ రెడ్డికి ‘రెడ్ ఆర్మీ’తో సిపిఐ ఘనంగా అంతిమ వీడ్కోలు పలికింది. హైదరాబాద్ హియత్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్ సురవరం సుధాకర్ రెడ్డికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో గౌరవ వందనం అనంతరం మధ్యాహ్నం 3.20 గంటలకు ఆయన అంతిమయాత్ర మఖ్దూంభవన్ నుంచి ప్రారంభమై హియాయత్ వై జంక్షన్, నారాయణగూడ చౌరస్తా, చిక్కడల్లి, ఆర్ చౌరస్తా, గోల్కోండ చౌరస్తా, ముషీరాబాద్ ప్రాంతాల మీదుగా సికింద్రాబాద్ ప్రభుత్వ గాంధీ మెడికల్ కాలేజీకి చేరింది. అంతిమయాత్రలో ముందు భాగంలో పోలీసు కవాత్ ఉండగా, అనంతరం రెడ్ వాలంటీర్లు ఎర్ర జెండాలతో కవాతు, ప్రజానాట్య మండలి కళాకారుల విప్లవ గేయాలాపనలు, డప్పుల మధ్య సురవరం సుధాకర్ అమర్ రహే నినాదాలు మారుమ్రోగాయి. భారీ సంఖ్యలో తరలి వచ్చిన సిపిఐ కార్యకర్తలు, నాయకులు, సుధాకర్ అభిమానులు, ప్రజలతో దారి పొడవునా అశ్రునయానాల మధ్య అంతిమ యాత్ర కొనసాగింది. హిమాయత్ సిపిఐ నగర నాయకత్వం పుష్పాంజలి ఘటించింది. ఆర్ క్రాస్ రోడ్స్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం వద్ద సుధాకర్ రెడ్డి అంతిమ యాత్రకు పుష్పాంజలి ఘటించారు. సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని నేతల బృందం అరుణపతాకాలు చేబూని సుధాకర్ భౌతికకాయానికి పూలమాలలు వేసి అరుణాంజలి సమర్పించారు.

మెడికల్ కళాశాలకు భౌతిక ఖాయం అప్పగింత
సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయాన్ని వైద్యవిద్యార్థుల పరిశోధనల నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాలకు అప్పగించారు. సురవరం సుధాకర్ రెడ్డి కోరిక మేరకు భార్య డాక్టర్ బి.వి.విజయలక్ష్మి, కుమారులు కపిల్, నిఖిల్ కలిసి సిపిఐ నేతలు సురవరం సుధాకర్ భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఇందిర, ఫిజియాలజీ హెచ్ ప్రొఫెసర్ రమాదేవి, అనాటమీ ప్రొఫెసర్ సుధాకర్ అప్పగించారు. సురవరం భౌతికకాయానికి ఎంబామింగ్ (రసాయనాల పూత) చేసి భధ్రపరుస్తామని, వైద్యవిద్యార్థుల పరిశోధనలు, శరీర నిర్మాణం, సైంటిఫిక్ నాలెడ్జ్ పెంచుకునేందుకు దోహదపడుతుందని ఈ సందర్భంగా ప్రొఫెసర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎంఎల్ నెల్లికంటి సత్యం, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి, కె.శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు, ఈ.టి.నరసింహ, కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్.బోస్, ఎన్ నాయకురాలు అనీ రాజా తదితరులు సుధాకర్ భౌతిక కాయానికి చివరి సారిగా నివాళులు అర్పించారు. విద్యార్థి దశ నుంచి అనేక పోరాటాలు చేస్తూ ప్రజాసేవలో జీవితం గడిపిన సుధాకర్ రెడ్డి చివరికి తన భౌతికకాయాన్ని కూడా వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా గాంధీ ఆసుపత్రికి అందజేశారని నేతలు కొనియాడారు.

సురవరం సుధాకర్ ప్రభుత్వ గౌరవ వందనం
సిపిఐ అగ్రనేత, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపి సురవరం సుధాకర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో గౌరవ వందనం సమర్పించింది. హైదరాబాద హిమాయత్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్ భౌతికకాయానికి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ పోలీసులు అంతిమ గౌరవ వందనం (శోక్ శస్త్ర) సమర్పించారు. హైదరాబాద్ నగర ఆర్మూడ్ రిజర్వ్ (సిఎఆర్)కు చెందిన ఆర్ జి.ఉపేంద్ర నేతృత్వంలో సాయుధ పోలీసులు వెంకటేష్, జగదీష్, రాజు, అంజి, శ్రీకాంత్, షఫీ, అనాస్, ఆనంద్, దీపక్, హన్మంత్ తుపాకాలు తలక్రిందులు చేసి సురవరం సుధారకర్ సంతాప సూచకంగా గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా సిఎఆర్ చెందిన పోలీసు బ్యాండ్ బృందం సురవరం సుధాకర్ సంతాప సూచకంగా గౌరవ వందనం పలికింది.