నేటి సత్యం నాగర్ కర్నూల్ ఆగస్టు 25 

*కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆశాలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి*
*ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజాభవన్ ముట్టడిస్తాం*
*సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు*
*తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు చెల్లించాలని ఉద్యోగ భద్రత ఈఎస్ఐపిఎఫ్ తదితర సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు మహా ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా వైద్యాధికారి డిఎం & హెచ్ఓ రవికుమార్ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది*
*ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ నూతన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి రెండు సంవత్సరాలు కావస్తున్న ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించకపోగా ఆశ కార్యకర్తలపై నిర్బంధాలు పెరిగాయని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు.. పైగా ఆశ వర్కర్లు పనిచేయడం లేదని ప్రభుత్వం చెప్పడం సరైన మాట కాదని ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు కాబట్టే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ ఆశ వర్కర్లను గుర్తించిందని అలాంటి సంస్థ గుర్తించిన ప్రభుత్వ మాత్రం పనిచేయడం లేదని చెప్పడం సరి అయిన పద్ధతి కాదని ఆయన అన్నారు.. మరొకవైపు ప్రక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం చెల్లిస్తూ 1,50,000 గ్రాటిటి అమలు చేస్తూ 180 రోజుల ప్రసూతి సెలవులు ప్రకటించిన అక్కడి ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వం ఆశాల సమస్యలు ఎందుకు పరిష్కారం చేయదని ఆయన ప్రశ్నించారు.. లక్షల కొద్ది రూపాయల జీతాలతో మరొకరు అతి తక్కువ వేతనాలతో కార్మికులు పనిచేస్తున్నారని ఇలాంటి అసమానతలు కొనసాగుతున్న ముఖ్యమంత్రి మాత్రం సమాజంలో అసమానతలు పోవాలని చెప్పడం హాస్యాస్పదమని ఆయన అన్నారు.. అందులో భాగంగా ఆశ వర్కర్లకి ఇవ్వాల్సిన లెప్రసి ఎలక్షన్స్ డ్యూటీ డబ్బులు ఆరు నెలల కరోనా రిస్క్ అలవెన్స్ ఇదేమి చెల్లించకుండా పెండింగ్లో ఉంచుకున్నాయని ఆయన అన్నారు.. ఇప్పటికైనా తెలంగాణ నూతన ప్రజా ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే ప్రజా భవన్ ముట్టడిస్తామని ఆయన సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వర్ధన్ పర్వతాలు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య శంకర్ నాయక్ కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటికాశన్న ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కళావతి ప్రధాన కార్యదర్శి చెన్నమ్మ ఉపాధ్యక్షురాలు వసుంధర శివలీల జయమ్మ వరలక్ష్మి శశికళ కృష్ణవేణి చంద్రకళ శ్రీదేవి మానస భాగ్య అలివేల మంజుల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు*