నేటి సత్యం. తెలకపల్లి ఆగస్టు 25 
నడిగడ్డ గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల కల నిజం చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్,మాజీ శాసన సభ్యులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు
ప్రజల కోరిక మేరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో తెలకపల్లి మండలంలోని నడిగడ్డ వాగుపై 3 కోట్ల 20 లక్షలతో వంతెన నిర్మాణం జరిగేలా కృషి చేసిన మర్రి జనార్ధన్ రెడ్డి గారికి, మంజూరు చేసిన కేసీఆర్ గారికి గ్రామ ప్రజలు ఈరోజు వంతెనపై పాలాభిషేకం చేసి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
నడిగడ్డ గ్రామ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నిజమైంది. గ్రామంలోని చిన్న వాగుపై వంతెన నిర్మాణం పూర్తవడం ద్వారా ప్రజల నిత్యజీవన కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించింది. వర్షాకాలంలో వాగు దాటే ప్రతి అడుగులో భయం, పిల్లలు పాఠశాలకు వెళ్లే సమయంలో ఎదురైన అడ్డంకులు, రైతులు పొలాలకు చేరుకోవడంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఇవన్నీ ఇప్పుడు మాజీ శాసన సభ్యులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు ఈ వంతెన నిర్మాణంతో చరిత్రలో నిలిచారు.
ఈ వంతెనతో నడిగడ్డ ప్రజల జీవితంలో ఒక కొత్త దశ ఆరంభమైంది. ఇక ప్రయాణం సురక్షితం, విద్యార్థుల చదువు అంతరాయం లేకుండా కొనసాగుతుంది, రైతుల పంటలు సులభంగా మార్కెట్లకు చేరతాయి. ఈ వంతెన నడిగడ్డ ప్రజల