నేటి సత్యం ఆగస్టు 25
*సి పి ఆర్ ద్వారా ప్రాణాలు కాపాడుదాం*
*మన గుండె పదిలం గుండెను కాపాడుదాం
*గుండె వైద్య నిపుణులు డాక్టర్.రాజేష్
*స్థానిక ఎస్ ఐ చైతన్య కిరణ్
*రాయికోడ్ ఆగస్టు 25 ( నేటి సత్యం
)* సిపిఆర్ విధానం ద్వారా ప్రాణాలు కాపాడదామని మన గుండె పదిలం గుండెను కాపాడుదామని హోప్ న్యూరో కార్డియాలజీ హాస్పిటల్ వైద్యులు రాజేష్, స్థానిక ఎస్ ఐ చైతన్య కిరణ్ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన రాయికోడ్ లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల కళాశాల, తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో సిపిఆర్ విధానం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నేటి సమాజంలోఎంతోమంది చిన్నపిల్లల నుంచి మధ్య వయస్కులు ,వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారని అన్నారు.ఒక వ్యక్తికి హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తులు ఆయనను పరిశీలించి నిర్ధారణ చేసుకున్న తర్వాత సిపిఆర్ విధానాన్ని అవలంబించాలని అది ఏ విధంగా చేయాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. సిపిఆర్ విధానంపై అవగాహన ఉన్నవారు గుండె నొప్పి వచ్చిన వ్యక్తిని కాపాడి అంబులెన్స్ లో కానీ అందుబాటులో ఉన్న ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడిన వారవుతారని అన్నారు. ఈ కార్యక్రమం హోప్ న్యూరో కార్డియాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణమూర్తి లక్షల మందికి సిబిఆర్ విధానం ద్వారా అవగాహన కల్పించాలని వారి ప్రాణాలను కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఈఓ మానయ్య, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శంకర్, నాయకులు రాములు, రాచయ్య స్వామి,హోప్ న్యూరో యాజమాన్యం టి శ్రీనివాస్ బి శ్రీనివాస్ తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ మంజులవాని, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల కళాశాల స్పెషల్ ఆఫీసర్ దీపిక, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ , ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.