(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం ఆగస్టు 26 
పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద అక్రమ ఇసుక లారీ సీజ్
జోగులాంబ గద్వాల జిల్లా, ఆగస్టు 26 :
ఉండవెల్లి మండలంలోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అక్రమంగా హైదరాబాద్‌కు తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకున్నారు. ఈ విషయాన్ని ఉండవెల్లి ఎస్సై శేఖర్ మీడియాకు వెల్లడించారు.
ఎస్సై వివరాల ప్రకారం— తనిఖీల సందర్భంగా టోల్‌ప్లాజా వద్ద లారీని ఆపి పరిశీలించగా, ఎలాంటి అనుమతిపత్రాలు లేకుండా భారీ మొత్తంలో ఇసుకను తరలిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే లారీని స్వాధీనం చేసుకొని, డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.